Selva Raghavan : నేనింకా చనిపోలేదు.. నెటిజన్ కామెంట్ కి రిప్లై ఇచ్చిన స్టార్ డైరెక్టర్..

సెల్వ రాఘవన్ గత మూడు సినిమాలు కూడా పరాజయం చెందాయి. ఇదే సమయంలో నటుడిగా మాత్రం ఆకట్టుకుంటూ బిజీ అవుతున్నాడు. తాజాగా ఓ తమిళ అభిమాని సెల్వ రాఘవన్ తీసిన ఫస్ట్ సినిమాని టీవీలో చూస్తూ దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Selva Raghavan : నేనింకా చనిపోలేదు.. నెటిజన్ కామెంట్ కి రిప్లై ఇచ్చిన స్టార్ డైరెక్టర్..

Director Selva Raghavan counter tweet to netizen

Updated On : May 5, 2023 / 1:04 PM IST

Selva Raghavan :  తమిళ్ లో స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, 7/G బృందావన కాలనీ, యుగానికి ఒక్కడు లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించాడు,. డైరెక్టర్ సెల్వ రాఘవన్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ కి సొంత అన్నయ్య సెల్వ రాఘవన్. డైరెక్టర్ గానే కాక నటుడిగా, పాటల రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సెల్వ రాఘవన్.

అయితే సెల్వ రాఘవన్ గత మూడు సినిమాలు కూడా పరాజయం చెందాయి. ఇదే సమయంలో నటుడిగా మాత్రం ఆకట్టుకుంటూ బిజీ అవుతున్నాడు. తాజాగా ఓ తమిళ అభిమాని సెల్వ రాఘవన్ తీసిన ఫస్ట్ సినిమాని టీవీలో చూస్తూ దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోని షేర్ చేసి.. ఈ సినిమా దర్శకుడు చనిపోయినట్టు ఉన్నాడు. లేదంటే సినిమాలు తీయడమైనా ఆపేసి ఉండాలి, అతని సినిమాల్లో ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి అని వరుస ట్వీట్స్ చేశాడు. ఈ ట్వీట్స్ కి సెల్వ రాఘవన్ ని కూడా ట్యాగ్ చేయడంతో సెల్వ రాఘవన్ రిప్లై ఇచ్చాడు.

Brahmanandam : కర్ణాటక ఎలక్షన్స్ లో బ్రహ్మానందం ప్రచారం.. ఎవరికోసం? ఏ పార్టీ కోసం?

ఆ నెటిజన్ ట్వీట్స్ కి సెల్వ రాఘవన్ రిప్లై ఇస్తూ.. ఎందుకు అలా అన్నావు ఫ్రెండ్? నేను ఇంకా చనిపోలేదు. అలా అని సినిమాలు తీయడం కూడా ఆపలేదు. కొంచెం గ్యాప్ తీసుకున్నాను. నా కోసం నేను కొంత సమయం గడుపుతున్నాను. నేను ఇంకా నలభైలలోనే ఉన్నాను. త్వరలోనే మంచి సినిమాలతో మీ ముందుకి వస్తాను అని ట్వీట్ చేశాడు. దీంతో సెల్వ రాఘవన్ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఆ నెటిజన్ సెల్వ రాఘవన్ రిప్లై చూసి ఆశ్చర్యపోతూ.. సర్.. మీరు రిప్లై ఇస్తారనుకోలేదు. నేను కాలేజీ రోజుల నుంచి మీ సినిమాలకు అభిమానిని. మీరు ఇంకా మంచి సినిమాలు తీసి వచ్చే జనరేషన్ కి కూడా అందించాలని ట్వీట్ చేశాడు.