నితిన్‌కు వాళ్లన్నయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులెప్పుడూ ఉంటాయ్..
‘భీష్మ’ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పారు..

‘భీష్మ’ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పారు..
యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా.. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ : “నితిన్‌కు వాళ్లన్నయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులెప్పుడూ ఉంటాయ్. ఆయన తరపునా, ఆయన అభిమానులందరి తరపునా నితిన్‌కు ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ వెంకీ కుడుముల, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ మహతి.. మిగతా అందరికీ అభినందనలు చెబుతున్నా. ఇప్పటికే నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. 21న అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా. రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి సక్సెస్ మార్గంలో ఉంది. ఇప్పుడు ‘భీష్మ’ వస్తోంది.
ఆమెకు మరిన్ని విజయాలు రావాలి. బెంగళూరు నుంచి 50 నిమిషాలే ప్రయాణం కాబట్టి ఆమె వర్రీ అవ్వాల్సిన పనిలేదు. మీరెప్పుడూ మాకు బాగా దగ్గరిగానే ఉంటారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్‌లో రెండున్నాయి. ఒకటి వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్, చాలా బాగా దాన్ని డిజైన్ చేశారు.
రెండు.. జానీ మాస్టర్ చేసిన లాస్ట్ సాంగ్ ‘వాటే బ్యూటీ’. మా ‘బుట్టబొమ్మ’ సాంగ్ ఎంత బాగా చేశాడో, దాన్ని అంత బాగా చేశాడు. ‘జెర్సీ’ తర్వాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నారు. మంచి సక్సెస్‌తో 2020లోకి అడుగుపెట్టబోతున్నారు. 21 సాయంత్రం పెద్ద పార్టీ ఇవ్వాలని, దానికి నన్ను పిలవడం మర్చిపోవద్దని కోరుకుంటున్నా” అని అన్నారు.