‘కుశలమా’! ‘నీకు కుశలమేనా’!! – వై. వి. ఎస్‌. చౌదరి

కరోనా ఎఫెక్ట్ : డైరెక్టర్ వై.వి.ఎస్. చౌదరి సందేశం..

  • Published By: sekhar ,Published On : March 30, 2020 / 07:02 AM IST
‘కుశలమా’! ‘నీకు కుశలమేనా’!! – వై. వి. ఎస్‌. చౌదరి

Updated On : March 30, 2020 / 7:02 AM IST

కరోనా ఎఫెక్ట్ : డైరెక్టర్ వై.వి.ఎస్. చౌదరి సందేశం..

‘కుశలమా’! ‘నీకు కుశలమేనా’!! అది పాత తెలుగు సినిమా పాటా కాదు, కేవలం నాలుక మీద నుండీ దొర్లిన పదాల కలయికా కాదు.
పై పదాల కలయిక.. మనం మన ఆత్మీయుల యోగక్షేమాలను తెలుసుకోవాలనుకునే తొలి ‘పలకరింపు’.
మన మధ్య జరిగిన పూర్వ పరిచయాల వల్ల పుట్టుకొచ్చిన అనురాగం, అనుబంధాలను నెమరువేసుకునే తొలి ‘పలకరింపు’.

‘కరోనా-వైరస్‌’ వ్యాప్తి లాంటి విపత్కర పరిస్థితుల్లో.. ఆ ‘పలకరింపు’కి పని కల్పించండి. మన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, మన వద్ద పనిజేస్తున్న వాళ్ళు ఎక్కడున్నా వారి యోగ-క్షేమాల్ని తెలుసుకోవడమే కాకుండా.. మీ మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ వారిలో మానసిక స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని నింపండి. వారికి అవసరమైతే.. మీకు కుదిరినంతలో ఆర్ధికంగా చేయూతనివ్వండి.

నిపుణుల సలహా, సంప్రదింపుల ద్వారా మన ప్రభుత్వాలు విధించిన ఆంక్షలకు అనుగుణంగా మసలుకుంటూ, ప్రకటించిన పధకాలను వినియోగించుకుంటూ, ‘కరోనా-వైరస్’‌ కట్టడికి చేపట్టాల్సిన జాగ్రత్తల్ని స్వయం నియంత్రణతో పాటిస్తూ.. మిమ్మల్ని మరియూ మీ కుటుంబసభ్యులను కాపాడుకుంటూ బాధ్యతగల పౌరులుగా ఇంటిపట్టునే ఉండాల్సిందే అనే సందేశాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు పంచుకోండి.
ఆ దేవుని దయతో ప్రస్తుతానికి నేను, నా కుటుంబ సభ్యులంతా క్షేమం. అదే దేవుని దయ మీకూ ఉంటుందని ఆశిస్తూ, ఉండాలని కోరుకుంటూ.. మీ క్షేమ సమాచారాన్ని తెలుపగోరుతూ..
మీ
భవదీయుడు, 
వై. వి. ఎస్‌. చౌదరి.
#YVSChowdary

Read Also : ఈ పాప ఎవరో తెలుసా?.. ఇంకెవరు మన లచ్చక్కే..