Tron: Ares : తెలుగులో కూడా ‘ట్రాన్: ఏరీస్’.. ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..
తాజాగా ట్రాన్: ఏరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

Tron: Ares
Tron: Ares : డిస్నీ నుంచి వస్తున్న మెగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ట్రాన్: ఏరీస్’. ట్రాన్ సిరీస్‌లో ఇది మూడవ భాగం. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఏఐ నడుస్తుండటంతో ఈ సినిమాలో అదే ప్రధాన పాత్రగా ఉండబోతుంది.
తాజాగా ట్రాన్: ఏరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
Also Read : Sreeleela : అసలు నేనెలా లవ్ చేస్తా.. ఎట్టకేలకు లవ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.. అమ్మతో ముడిపెడుతూ..
ట్రైలర్ చూస్తుంటే.. ఓ ఏఐ ప్రోగ్రామ్ ఆరీస్ మానవుల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఏం చేయబోతున్నాడు అని ఆసక్తి నెలకొంది. జారెడ్ లేటో ఆరీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. జెఫ్ బ్రిడ్జస్ మరోసారి ట్రాన్ యూనివర్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. విజువల్స్, విఎఫ్‌ఎక్స్ అయితే ట్రైలర్ లోనే అదిరిపోయాయి. ట్రాన్: ఏరీస్ సినిమా అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆల్మోస్ట్ 15 ఏళ్ళ తర్వాత ట్రాన్ సిరీస్ నుంచి సినిమా వస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి.