DJ Tillu Trailer : ‘రాధిక ఆప్తే.. ఆపకుంటే మాత్రం’? ట్రైలర్ కిరాక్ ఉందిగా!
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘డీజే టిల్లు’ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Dj Tillu Trailer
DJ Tillu Trailer: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్‌కు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు’.. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. హీరోగా నటిస్తున్న సిద్ధు, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండడం విశేషం.
Vijay Deverakonda : ఫ్యూచర్ పాన్ ఇండియా స్టార్.. విజయ్ దేవరకొండకు మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్..
టీజర్‌తో సినిమా పక్కా యూత్ ఎంటర్టైనర్ అని అర్థమైంది. ఇటీవల రిలీజ్ చేసిన ‘ఐటం రాజా.. క్రేజీ రోజా.. పటాస్ పిల్లా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బుధవారం ‘డీజే టిల్లు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా మీద అంచనాలు మరింత పెంచేసింది.
DJ Tillu : ‘ఐటం రాజా.. క్రేజీ రోజా’.. అనిరుధ్ మరో చార్ట్ బస్టర్..
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ.. ముఖ్యంగా తెలంగాణ యాసలో సిద్ధు చెప్పిన డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. సినిమాలో కంటెంట్‌తో పాటు యూత్‌కి కావలసిని అన్ని మసాలాలు ఉన్నాయని ట్రైలర్ ప్రూవ్ చేసింది. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు విజువల్స్, శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ‘డీజే టిల్లు’ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది.