Alia Bhatt Child Artist: అలియా భట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..? ఆ హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో..
Alia Bhatt Child Artist: అలియాభట్ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమాలో నటించింది. (Alia Bhatt)
Alia Bhatt
Alia Bhatt : ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో అలియా భట్ ఒకరు. వరుస సినిమాలతో, వరుస విజయాలతో దూసుకుపోతుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా కష్టపడి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క తల్లిగా, రణబీర్ కపూర్ భార్యగా ఫ్యామిలీతో బిజీగా ఉంది.
అలియాభట్ 2012 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందని అందరికి తెలుసు. కానీ అలియాభట్ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమాలో నటించింది. అలియా భట్ తండ్రి మహేష్ భట్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, నిర్మాత, రచయిత. ఆయన రాసిన ఓ సినిమాలో అలియా భట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.
Also Read : Geetha Madhuri : నేను నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి.. గీత మాధురి కామెంట్స్ వైరల్..
అక్షయ్ కుమార్, ప్రీతీ జింతా జంటగా తెరకెక్కిన సంఘర్ష్ అనే సినిమాలో అలియా భట్ చిన్నప్పుడు నటించింది. ఈ సినిమాలో ప్రీతీ జింతా చిన్నప్పటి పాత్రలో అలియా భట్ నటించింది. సినిమాలో అలియా కాసేపే కనిపించినా తన ఎమోషనల్ నటనతో మెప్పిస్తుంది. ఈ సినిమా చేసేటప్పుడు అలియాకు కేవలం ఆరేళ్ళు మాత్రమే. 1999 లో రిలీజయిన సంఘర్ష్ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తనకు అవకాశం ఉన్నా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదు కానీ పలు బాలీవుడ్ టీవీ షోలలో కనిపించింది. అలా అలియా భట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఏకైక సినిమా సంఘర్ష్.
