చిరంజీవి ఏ సినిమా నుంచి మెగాస్టార్ అయ్యారో తెలుసా..

తెలుగు వారికి మెగాస్టార్ అంటే గుర్తొచ్చేది చిరంజీవి మాత్రమే. అసలు ఇది ఎప్పటి నుంచి వచ్చింది.. ఏదైనా అవార్డు గెలుచుకుంటే వచ్చిందా అంటే కాదు. అసలు ఆ టైటిల్ పెట్టింది ప్రొడ్యూసర్.. కేఎస్ రామారావు. దాని గురించి ఆయన మాటల్లోనే…
‘మరణమృదంగం టైమ్ కు చిరంజీవి చేస్తున్న సినిమాల స్థాయి, వస్తున్న వసూళ్లు అద్భుతం. నాకు బాగా ఇష్టమైన హీరో. నా సొంత ఫ్యామిలీలా ఫీల్ అవుతాను. ఆయనకు అప్పటికే రకరకాల బిరుదులున్నాయి. సుప్రీమ్ హీరో అనే పేరు ఉంది. కానీ నా హీరోకు ఓ కొత్త తరహా పేరు ఉండాలని అనుకున్నా. బాగా ఆలోచించాను. ఆ ఆలోచన నుంచి పెట్టిన పేరు మెగాస్టార్’
‘చిరంజీవితో తీసిన మరణ మృదంగం సినిమాతో మెగాస్టార్ అనే టైటిల్ పెట్టాను. అక్కడ్నుంచి అదే ఫిక్స్ అయిపోయింది’ అని కేఎస్ రామారావు బయటపెట్టారు. చిరంజీవితో అభిలాష, మరణమృదంగం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, ఛాలెంజ్, రాక్షసుడు లాంటి సినిమాలు చేసిన ఈ నిర్మాత.. ఆ తర్వాత మళ్లీ చిరంజీవితో సినిమా చేయలేకపోయారు.
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తున్న కేఎస్ రామారావు.. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా నిర్మించారు.