Kota Srinivasa Rao
Kota Srinivasa Rao : ఎన్నో విలక్షణ పాత్రలతో ఏకంగా 750 సినిమాలతో మెప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు నేడు తెల్లవారుజామున మరణించారు. సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఇంటివద్దకు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.
కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేసారు, సినిమాల్లోకి ఎలా వచ్చారు తెలుసా?
కోట శ్రీనివాసరావు తండ్రి కంకిపాడులో డాక్టర్. దీంతో చిన్నప్పట్నుంచి కోటకు డాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ కాలేజీ రోజుల్లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నాటకాలు వేసేవారు. నాటకాలు వేస్తూనే డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యొగం వచ్చింది. పలు బ్రాంచ్ లలో పనిచేసిన తర్వాత కోట శ్రీనివాసరావు హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉదయం బ్యాంక్ లో పనిచేసి సాయంత్రాలు నాటకాలు వేసేవాళ్ళు. బయట నాటక సమాజంతో పాటు, రేడియో నాటకాలు కూడా వేశారు. రవీంద్ర భారతిలోనే నూట యాభయ్ కి పైగా నాటకాలు వేశారు.
అలా ఓ సారి ప్రాణం ఖరీదు అనే నాటకం వేయగా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ చూసి ఆ నాటకాన్ని తీసుకొని సినిమాగా తెరకెక్కించారు. అలా ప్రాణం ఖరీదు సినిమాతో 1978 లో కోట శ్రీనివాసరావు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే చిరంజీవి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ 1983 లో ఒక సినిమా చేసారు. అనంతరం బ్యాంక్ లో సెలవులు పెట్టుకుంటూ కొన్ని సినిమాలు చేసినా తర్వాత అవకాశాలు పెరగడంతో ఉద్యోగం మానేసి నటుడిగా స్థిరపడడ్డారు.