Fahadh Faasil : పుష్ప విలన్ రిటైర్మెంట్ ప్లాన్ వింటే మైండ్ పోతుంది.. స్టార్ నటుడు ఆ పని చేస్తాడట..

ఈ క్రమంలో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి కూడా చెప్పాడు.

Fahadh Faasil : పుష్ప విలన్ రిటైర్మెంట్ ప్లాన్ వింటే మైండ్ పోతుంది.. స్టార్ నటుడు ఆ పని చేస్తాడట..

Fahadh Faasil

Updated On : July 25, 2025 / 7:43 AM IST

Fahadh Faasil : మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పుష్ప సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో నటించి మెప్పించారు. ఇక తన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతుండటంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఫహద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేడు రిలీజవ్వబోతున్న తన సినిమా మరీసన్ ప్రమోషన్స్ లో భాగంగా నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి కూడా చెప్పాడు.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చింది?

ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ఇటీవల నేను స్పెయిన్ దేశంలోని బార్సిలోనాకి వెళ్ళాను. ఆ సిటీ నాకు నచ్చింది. నేను యాక్టింగ్ నుంచి రిటైర్ అయ్యాక అక్కడ క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలి అనుకుంటున్నాను. ఒక మనిషిని తన గమ్యానికి చేర్చడంలో మంచి అనుభూతి ఉంది. డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్నవారికి అది ప్రశాంతతను కూడా ఇస్తుంది అని తెలిపాడు. మరి ఫహద్ నిజంగానే రిటైర్ అయిన తర్వాత స్పెయిన్ వెళ్ళిపోయి అక్కడ క్యాబ్ డ్రైవర్ గా చేస్తాడా? అతని భార్య హీరోయిన్ నజ్రియా ఒప్పుకుంటుందా చూడాలి మరి.