HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. పవన్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఎన్నికోట్లంటే..
ఈ సినిమాకు హైప్ వచ్చి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

HariHara VeeraMallu
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నిన్న జులై 24న థియేటర్స్ లో రిలీజయింది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు. రెండేళ్ల తర్వాత పవన్ స్క్రీన్ మీద కనపడటం, పవన్ డైరెక్ట్ గా వచ్చి ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాకు హైప్ వచ్చి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ సేల్స్ తోనే హరిహర వీరమల్లు సినిమా దాదాపు 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ సినిమా.. థియేటర్స్ లో ఆ సీన్స్ డిలీట్..
ఇక అడ్వాన్స్ సేల్స్, మొదటి రోజు కలిపి హరిహర వీరమల్లు సినిమా గ్రాస్ పరంగా దాదాపు 65 నుంచి 70 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించిందని సమాచారం. దాదాపు 45 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిందని తెలుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గత మూడు సినిమాలు వకీల్ సాబ్, బ్రో, భీమ్లా నాయక్ సినిమాల కంటే ఎక్కువ. ఈ కలెక్షన్స్ బాక్సాఫీస్ సమాచారం మాత్రమే. మూవీ యూనిట్ అధికారికంగా ఇంకా హరిహర వీరమల్లు మొదటిరోజు కలెక్షన్స్ ప్రకటించలేదు.