Sushmita Konidela : చిరంజీవి కూతురు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? మెగాస్టార్, పవర్ స్టార్ కాదు.. మరి ఎవరంటే..
చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. (Sushmita Konidela)
Sushmita Konidela
Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ సినీ పరిశ్రమలో ఉన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ స్థాపించి సినిమాలు, సిరీస్ లు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు సిరీస్ లు, ఓ సినిమా నిర్మించగా సుస్మిత కొణిదెల ఇప్పుడు తండ్రినే హీరోగా పెట్టి సినిమా చేస్తుంది. మరో వైపు తండ్రికి స్టైలిస్ట్ గా, చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేస్తుంది.(Sushmita Konidela)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది. ఈ సినిమాను సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఇద్దరు నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.
Also Read : Jai Balayya : జై బాలయ్య అంటూ థియేటర్ దగ్గర రచ్చ చేస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..
ఈ క్రమంలో సుస్మిత కొణిదెలను సరదాగా మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీ ఫేవరేట్ హీరో ఎవరు అని అడిగారు. దీంతో సుస్మిత చాలా కష్టమైన ప్రశ్నే అడిగారు అంటూ.. రజినీకాంత్ అని చెప్పింది. టాలీవుడ్ హీరోల్లో ఎవరూ లేరా అంటే నవ్వుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. దీంతో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలకు తన ఇంట్లో వాళ్ళు కాకుండా ఫేవరేట్ హీరో రజినీకాంత్ అని తెలుస్తుంది.

అలాగే.. నాన్నతో సినిమా తీయడమే ఒక గిఫ్ట్, ఇక బాబాయ్ తో సినిమా అంటే వరం లాంటిదే. నేను ఆల్రెడీ పవన్ బాబాయ్ ని అడిగాను నా నిర్మాణంలో సినిమా చేయమని, జరుగుతుందో లేదో తెలియదు అని తెలిపింది సుస్మిత.
Also Read : Chiranjeevi : చిరంజీవి రంగంలోకి దిగి ప్రభుత్వాలతో మాట్లాడతా అన్నారు.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..
