RGV : ఏ సినిమా ఫ్లాప్ అయినా పట్టించుకోని ఆర్జీవీ.. ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం బాధపడ్డాడు తెలుసా..

తన సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా పట్టించుకోడు ఆర్జీవీ. కానీ ఓ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం బాధపడ్డాడు అని మీకు తెలుసా.

RGV : ఏ సినిమా ఫ్లాప్ అయినా పట్టించుకోని ఆర్జీవీ.. ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం బాధపడ్డాడు తెలుసా..

Do You Know Rgv gets Hurt for that Movie Flop

Updated On : February 7, 2025 / 1:02 PM IST

RGV : ఒకప్పుడు తన సినిమాలతో సెన్షేషన్స్ సృష్టించిన డైరెక్టర్ ఆర్జీవీ కొంతకాలంగా నా సినిమాలు నా ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు తీసుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. ఒకప్పుడు బాలీవుడ్ తో సైతం పొగిడించుకున్న దర్శకుడు ఇప్పుడు అసలు సినీ పరిశ్రమలో పట్టించుకునేవాళ్లే లేరు. ఆర్జీవీ గురించి తెలిసిన వాళ్ళు, ఆర్జీవీ ఇంటర్వ్యూలు చూసిన వాళ్లకు ఆర్జీవీ అర్దమైపోతాడు. అతనికి ఎమోషన్స్ ఉండవు, రిలేషన్స్ ఉండవు, ఇక బాధ అయితే అసలే ఉండదు. ఏడుపు కూడా రాదు. వాళ్ళ నాన్న చనిపోతేనే ఏడవని ఆర్జీవీ కూడా బాధపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

Also Read : Sobhita Dhulipala-Naga Chaitanya : చైతన్యపై శోభిత బ్యూటిఫుల్ పోస్ట్.. ఇన్నాళ్లకు నీ ముఖదర్శనం సామీ..

ఇక తన సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా పట్టించుకోడు ఆర్జీవీ. కానీ ఓ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం బాధపడ్డాడు అని మీకు తెలుసా. ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్షణం క్షణం సినిమా ఫ్లాప్ అయినందుకు నేను చాలా బాధపడ్డాను. అది నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది. ఆ సంవత్సరం వచ్చిన గ్యాంగ్ లీడర్ కంటే మంచి సినిమా క్షణం క్షణం. అప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. శివ నేను హిట్ అవుతుంది అనుకోలేదు. కానీ క్షణం క్షణం హిట్ అవుతుంది అనుకున్నాను. ఆ సినిమా ఫెయిల్ అవడం నన్ను ఎఫెక్ట్ చేసింది. ఏ సినిమా ఫ్లాప్ అయినా పట్టించుకోలేదు కానీ ఆ సినిమాకు బాధపడ్డాను అని తెలిపారు.

Do You Know Rgv gets Hurt for that Movie Flop

వెంకటేష్, శ్రీదేవి కాంబోలో తెరకెక్కిన క్షణం క్షణం సినిమా 1991 అక్టోబర్ లో రిలీజయింది. ఈ సినిమా చాలా బాగుంటుంది, సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఎందుకో అప్పటి ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చకపోవడంతో ఫ్లాప్ అయింది. ఆర్జీవీకి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఆర్జీవీ – శ్రీదేవి కాంబోలో వచ్చిన మొదటి సినిమా అదే కావడం, శ్రీదేవికి హిట్ ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోవడంతోనే ఆర్జీవీ బాధపడ్డాడు అని సమాచారం. గతంలో కూడా కేవలం శ్రీదేవి, జియా ఖాన్ లు చనిపోయినప్పుడు మాత్రమే ఏడ్చాను లైఫ్ లో అని చెప్పారు ఆర్జీవీ. అందుకే తన దర్శకత్వంలో శ్రీదేవి నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆర్జీవీ బాధపడ్డాడు. ఆ తర్వాత ఆర్జీవీ శ్రీదేవితో గోవిందా గోవిందా సినిమా కూడా చేసాడు.

Also Read : Thandel : ‘తండేల్’ మూవీ రివ్యూ.. నాగచైతన్య, సాయి పల్లవి ప్రేమ జంటగా అదరగొట్టేశారుగా..

ఇటీవలే ఆర్జీవీ.. తాను తీసిన సూపర్ హిట్ సినిమా సత్య 27 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూసి ఏడ్చానని, ఇకపై మంచి సినిమాలు తీస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మరి ఆర్జీవీ మళ్ళీ మంచి సినిమాలు తీస్తాడో లేదో చూడాలి.