Sobhita Dhulipala-Naga Chaitanya : చైతన్యపై శోభిత బ్యూటిఫుల్ పోస్ట్.. ఇన్నాళ్లకు నీ ముఖదర్శనం సామీ..
తండేల్ మూవీ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ్ల ఓ ఆసక్తికర పోస్ట్‌ను చేసింది.

Naga Chaitanya wife Sobhita Dhulipala interesting post on instagram
అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయిక. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పాటలతో చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే నేడు(ఫిబ్రవరి 7)న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య భార్య నటి శోభితా ధూళిపాళ్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేశారు.
తండేల్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. చిత్రీకరణ సమయంలో మీరు చాలా ఫోకస్, పాజిటివ్‌గా ఉండడం చూశాను. ఈ అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందరితో పాటు నేను కూడా చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. అని శోభితా అంది. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అని అంది.
Thandel : ‘తండేల్’ మూవీ రివ్యూ.. నాగచైతన్య, సాయి పల్లవి ప్రేమ జంటగా అదరగొట్టేశారుగా..
దీనికి నాగచైతన్య రిప్లై ఇచ్చాడు. థాంక్యూ బుజ్జితల్లి అన్నారు.
శ్రీకాకుళంకు జిల్లాకు చెందిన మత్స్యకారులు కొందరు పలువురు మత్స్యకారులు ఫిషింగ్ కోసం గుజరాత్ పోర్ట్ కి వెళ్లగా అక్కడ అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి పట్టుబడి ఎలా తిరిగొచ్చారు అనే రియల్ కథకు ఓ ప్రేమ కథ జోడించి తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగచైతన్య పొడవాటి జుట్టు, గడ్డంతో తండేల్ రాజుగా కనిపించనున్నాడు. ఈచిత్ర షూటింగ్ 2023లో ప్రారంభం కాగా అప్పటి నుంచి చైతు గడ్డంతోనే ఉన్నాడు.
Sonu Sood: షాకింగ్.. సినీ నటుడు సోనూసూద్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు.. ఎందుకంటే?
ఏపీలో టికెట్ల రేట్ల పెంపు..
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్ర్కీన్స్‌లో రూ.50, మల్టీఫెక్స్‌లలో రూ.75 లను ఓ వారం రోజుల పాటు పెంచుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఎలాంటి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదు.