Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మొదటి సంపాదన ఎంతో తెలుసా..? చాలా తక్కువ..? అవి తీసుకెళ్లి..
సుడిగాలి సుధీర్ మొదటి సంపాదన ఎంతో తెలుసా మీకు?

Do You Know Sudigali Sudheer First Income Details Here
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇప్పుడు కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా ఫేమ్, ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఒక స్టార్ అయినా చాలా మంది లాగే కష్టాలు పడి పైకి వచ్చాడు. మెజీషియన్ గా మ్యాజిక్ షోలు చేస్తూ కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ జబర్దస్త్ షోలో ఒక ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన పర్ఫార్మెన్స్ తో అదే షోలో టీమ్ లీడర్ గా ఎదిగి బాగా పాపులర్ అయ్యాడు. అనంతరం యాంకర్, సినిమాల్లో కమెడియన్ అయ్యాడు.
Also Read : GAMA Awards : గామా అవార్డ్స్ 2025.. 5వ ఎడిషన్ గ్రాండ్ లాంచ్.. అవార్డ్స్ ఈవెంట్ ఎప్పుడంటే..
ఫుల్ పాపులారిటీ, ఫేమ్ వచ్చాకా హీరోగా కూడా మారి ఇప్పటికే నాలుగు సినిమాలు చేసాడు. త్వరలో మరో సినిమాతో రానున్నాడు. తన కామెడీ టైమింగ్, తన ట్యాలెంట్ తో సుధీర్ భారీ క్రేజ్, ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇటీవల ధనరాజ్ రామం రాఘవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుధీర్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో యాంకర్.. సుధీర్ ని మీ నాన్నతో ఉన్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అని అడిగారు.
Also Read : Janasena : మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు
దీనికి సుధీర్ సమాధానమిస్తూ.. నేను మ్యాజిక్ నేర్చుకున్నాక మొదటిసారి ఒక స్కూల్ లో మ్యాజిక్ షో చేసినప్పుడు పిల్లలందరి దగ్గర్నుంచి ఆల్మోస్ట్ 93 రూపాయలు వచ్చాయి. షో అయ్యాక ఇంటికి రిక్షాలో వెళ్లి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని నడుచుకుంటూ వెళ్లి ఆ 93 రూపాయలు మా నాన్నకు ఇచ్చాను. అదే నా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ అని తెలిపాడు. అలా 93 రూపాయలు పిల్లలు అందరూ కలిసి ఇచ్చిన అమౌంట్ దగ్గర్నుంచి ఇవాళ లక్షలు, కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు సుధీర్.
ప్రస్తుతం సుధీర్ హీరోగా ప్రస్తుతం G.O.A.T(Greatest Of All Times) అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో తమిళ భామ దివ్య భారతి హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా సుధీర్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.