Janasena : మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయబావుటా ఎగురవేసింది.

Janasena : మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు

Updated On : February 17, 2025 / 9:37 PM IST

Janasena : జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డేట్, ప్లేస్ ఫిక్స్ అయ్యాయి. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ తరపున ప్రకటన రిలీజ్ చేశారు.

Also Read : చేరికలపై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు.. టైమ్‌ చూసి మరీ వైసీపీ నుంచి..

అదే రోజున పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో దీనిపై పార్టీ నేతల స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రాండ్ సక్సెస్ చేసేలా కసరత్తు చేస్తున్నారు.

పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఈసారి పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించింది. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయబావుటా ఎగురవేసింది.