GAMA Awards : గామా అవార్డ్స్ 2025.. 5వ ఎడిషన్ గ్రాండ్ లాంచ్.. అవార్డ్స్ ఈవెంట్ ఎప్పుడంటే..

వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ ఇవ్వనున్నారు.

GAMA Awards : గామా అవార్డ్స్ 2025.. 5వ ఎడిషన్ గ్రాండ్ లాంచ్.. అవార్డ్స్ ఈవెంట్ ఎప్పుడంటే..

GAMA Awards 5th Edition Launch Event in Dubai

Updated On : February 18, 2025 / 6:45 AM IST

GAMA Awards : గామా అవార్డ్స్ 2025 సంవత్సరానికి 5వ ఎడిషన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇటీవల ఫిబ్రవరి 16, 2025న GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ 2025 గ్రాండ్ రివీల్ ఈవెంట్ అజ్మాన్, దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువాళ్ళు హాజరయ్యారు.

⁠ఈ వేడుకలో GAMA ఆర్గనైజింగ్ కమిటి మెంబర్ గాయకుడు రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ డేట్ & ప్లేస్, జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. GAMA అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ ఈవెంట్ ని జూన్ 7, 2025న ఘనంగా దుబాయ్ లోని షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ అవార్డు కమిటీకి జ్యూరీ చైర్ పర్సన్స్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, డైరెక్టర్ బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ ఇవ్వనున్నారు.

Also Read : Amitabh Bachchans Son In Law : అమితాబ్ బచ్చన్ అల్లుడి మీద చీటింగ్ కేసు..

గామా అవార్డ్స్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత నాలుగు ఎడిషన్లు పూర్తి చేసుకున్న గామా ఇప్పుడు 2025 జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్ ని ఘనంగా చేయనుంది. ప్రముఖ సినీ పెద్దలను, కళాకారులను ఇక్కడకు ఆహ్వానించి UAEలోని తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలిపారు.

GAMA Awards 5th Edition Launch Event in Dubai

గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్ కేసరి మాట్లాడుతూ.. గామా అవార్ద్స్ వినూత్నంగా వినోదభరితంగా నిర్వహిస్తున్నాం. వివిధ రంగాలలో ప్రముఖులను గుర్తించి వారికి ది గామా ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఇవ్వనున్నాం. ఇప్పటికే సినీ ప్రముఖులను ఆహ్వానించాము అని తెలిపారు.

Also Read : Manchu Manoj: పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ రియాక్షన్.. నారా లోకేశ్‌తో భేటీ..

ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా ఉన్న డైరెక్టర్ కోదండ రామిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, డైరెక్టర్ బి. గోపాల్ వీడియో సందేశాలు పంపించారు. కుంచె రఘు మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ ఈ గామా ఈవెంట్. నాకు గామా తో మంచి అనుబంధం ఉంది. ఉందని అన్నారు. మా కళాకారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటారు అని తెలిపారు.