Valentines Day 2024 : ఈ ‘వాలంటైన్స్ డే’కి రీ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో తెలుసా? ఏకంగా 9 సినిమాలు

ఈసారి వాలంటైన్స్ డే ప్రేమికులకు పండగే.. థియేటర్లలోకి ఏకంగా 9 సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అందులో మూడు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి.

Valentines Day 2024 : ఈ ‘వాలంటైన్స్ డే’కి రీ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో తెలుసా? ఏకంగా 9 సినిమాలు

Valentines Day 2024

Valentines Day 2024 : ప్రేమికుల రోజున చాలా జంటలు థియేటర్లకు పరుగులు తీస్తాయి. ఈసారి వీరి కోసం ప్రత్యేకంగా 9 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన ఈ సినిమాలు మరోసారి రిలీజవుతూ సందడి చేయబోతున్నాయి.

వాలంటైన్స్ డే అంటే గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్స్ ఇవే కాదు సరదాగా తమకు నచ్చిన సినిమాకు వెళ్లాలని ప్రేమికులు అనుకుంటారు. మనసుకి నచ్చిన ఎన్నో సినిమాలు మళ్లీ థియేటర్లకి వస్తే బాగుండును అనుకునే ప్రేమ జంటలకి ఈ వాలంటైన్ డే నిజంగా పండగనే చెప్పాలి. ఈసారి ఏకంగా 9 సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ ఒకప్పుడు సూపర్ హిట్ అయినవే. ఫిబ్రవరి 14న మళ్లీ థియేటర్లలోకి వస్తున్న సినిమాలేంటో చూసేద్దాం.

Shruti Haasan : స్టైలిష్ బ్లాక్ డ్రెస్‌లో హాట్ పోజులతో శ్రుతిహాసన్..

గౌతమ్ వాసుదేవ్ మేనన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ లో సూర్య, సమీరా రెడ్డి, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హేరిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు మనసుని హత్తుకుంటాయి. 2008, నవంబర్ 14న రిలీజైన ఈ సినిమా ఈ వాలంటైన్ డేకి రీ రిలీజ్ కాబోతోంది. సిద్ధార్థ్, శామిలి జంటగా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ గా వచ్చిన ‘ఓయ్’ సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ కాబోతోంది. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2009, జూలై 3న రిలీజైంది.

హను రాఘవపూడి డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్‌ జంటగా నటించిన ‘సీతా రామం’ 2022, ఆగస్టు 5న రిలీజైంది. ఈ సినిమా ఈసారి వాలంటైన్స్ డే రోజు మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ‘తొలిప్రేమ’ గతంలో రీ రిలీజైంది. వాలంటైన్స్ డేకి మరోసారి థియేటర్లలోకి వస్తోంది. ఎ.కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి దేవా సంగీతం అందించారు. 1998, జూలై 24న ఈ సినిమా రిలీజై యూత్‌ని ఊపు ఊపింది. కొరియోగ్రాఫర్ గానే కాకుండా డైరెక్టర్‌గా ప్రభుదేవాకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది ‘నువ్వొస్తానంటే వద్దంటానా’ సినిమా. 2005, జనవరి 14న విడుదలైంది. సిద్ధార్ధ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా ఈ వాలెంటైన్స్ డేకి థియేటర్లలోకి వస్తోంది. శర్వానంద్, అనన్య, అంజలి నటించిన ‘జర్నీ’ సినిమా కూడా వాలంటైన్స్ డే రోజున రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా 2011, డిసెంబర్ 16 రిలీజైంది. ఎం శరవణన్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు.

Shraddha Das : తడిసిన కురులతో శ్రద్ధాదాస్ అందాల ఆరబోత..

తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, మొహబ్బతే కూడా ఈ వాలంటైన్స్ డే రోజు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకే రోజు మళ్లీ విడుదల అవుతుండటంతో ఈసారి వాలంటైన్స్ డేకి థియేటర్లన్నీ ప్రేమికులతో క్రిక్కిరిసిపోయే అవకాశం కనిపిస్తోంది.