Vijay Pawan Kalyan : విజయ్ రీమేక్ చేసిన ఏకైక పవన్ కళ్యాణ్ సినిమా ఏంటో తెలుసా?
విజయ్ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఒకే ఒక్కటి రీమేక్ చేసారు. (Vijay Pawan Kalyan)
Vijay Pawan Kalyan
Vijay Pawan Kalyan : తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్నారు. దీంతో విజయ్ గురించి ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి. విజయ్ ని, మన పవన్ కళ్యాణ్ ని సినిమాల్లో, ఫ్యాన్స్ విషయంలో, రాజకీయాల్లో కంపేర్ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒకరి సినిమాలు ఒకరు రీమేక్ కూడా చేసారు.
విజయ్ మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ రీమేక్ చేసాడు. విజయ్ తమిళ్ సినిమాలు లవ్ టుడే ను సుస్వాగతం సినిమాగా, ఖుషి సినిమాని ఖుషి గా, తిరుప్పాచ్చి సినిమాని అన్నవరం సినిమాగా రీమేక్ చేశారు పవన్. అయితే విజయ్ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఒకే ఒక్కటి రీమేక్ చేసారు. అదే తమ్ముడు సినిమా. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా ‘తమ్ముడు’ని ‘బద్రి’ టైటిల్ తో విజయ్ తమిళ్ లో రీమేక్ చేశారు.
Also Read : Vijay Pawan Kalyan : విజయ్ సీఎం అయినా.. ఆ రికార్డ్ మాత్రం పవన్ కళ్యాణ్‌దే..
PA అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రీతీ జింతా హీరో హీరోయిన్స్ గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా 1999 లో రిలీజయి భారీ విజయం సాధించింది. ఇదే సినిమాని PA అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలోనే విజయ్, భూమికలతో తమిళ్ లో 2001 లో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది.
అయితే విజయ్ పవన్ కళ్యాణ్ ది ఒకటే సినిమా రీమేక్ చేసినా అనేక తెలుగు సినిమాలను రీమేక్ చేసారు. పెళ్లి సందడి ని నినైతేనా వందై గా రీమేక్ చేసారు. పవిత్ర బంధం సినిమాని ప్రియమానవలె గా, చిరునవ్వుతో సినిమాని యూత్ టైటిల్ తో, నువ్వు నాకు నచ్చావు సినిమాని వశీగర గా, ఒక్కడు సినిమాని ఘిల్లి గా, పోకిరి సినిమాని అదే టైటిల్ తో పోకిరి గా, ఆజాద్ సినిమాని వేలాయుధం గా రీమేక్ చేసాడు విజయ్.

Also Read : Vishal TVK: విజయ్ పార్టీలో చేరనున్న విశాల్.. గతంలో చెప్పినట్టే.. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
