Do You Know Vishwambhara Movie Director Vassishta Mallidi Struggles before Bimbisara
Director Vassishta : డైరెక్టర్ వశిష్ట కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వశిష్ట దర్శకుడు అయ్యేముందు చాలా మంది దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడమే కాక డైరెక్టర్ గా పలువురు హీరోలతో సినిమాలు మొదలయి ఆగిపోయాయట.
వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సినీ పరిశ్రమలోనే ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ తన కొడుకు డైరెక్టర్ గా మారడానికి పడ్డ స్ట్రగుల్స్ చెప్పుకొచ్చాడు.
Also Read : Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది.. ఇడియట్ స్టెప్పులతో అదరగొట్టిన మాస్ మహారాజ..
మల్లిడి సత్యనారాయణ మాట్లాడుతూ.. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొన్నాళ్ళు పనిచేశాక వినాయక్ ద్వారా రవితేజకు కథ చెప్పాడు. ఆయన ఓకే అన్నాడు. నిర్మాత కూడా ఆయనే చూస్తా అన్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత నితిన్ తో సినిమా అనుకున్నాం. డబ్బులు కూడా ఖర్చుపెట్టాం. కానీ అఆ సినిమా హిట్ అవ్వడంతో కొత్త డైరెక్టర్ తో వద్దు అన్నాడు నితిన్ వాళ్ళ నాన్న. అల్లు శిరీష్, మా వాడు ఫ్రెండ్స్. శిరీష్ కి కథ చెప్పి నిర్మాత కూడా ఓకే అయి అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారు. సినిమా ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా చేసారు. కానీ శ్రీరస్తు శుభమస్తు హిట్ అవ్వడంతో ఫ్రెండ్ అయినా కొత్త డైరెక్టర్ తో చేయను అన్నాడు శిరీష్. అరవింద్ గారు తిట్టినా వినలేదు. అరవింద్ గారు కావాలంటే వేరే హీరో డేట్స్ ఇప్పిస్తాను అన్నారు. అది కూడా అవ్వలేదు. అలా సినిమాలు మొదలయి ఆగిపోతుండటంతో మా వాడు బాధపడటం చూడలేక నేనే మళ్ళీ హీరోగా చేయమని చెప్పా.
మా వాడు హీరోగా సినిమా కూడా ఓపెనింగ్ చేసాం. మళ్ళీ ఏమైందో హీరోగా చేయను, రాజ్ తరుణ్ కి కథ చెప్పాను ఓకే చెప్పాడు అని చెప్పడంతో నాకు తెలిసిన నిర్మాత చేస్తా అనడంతో రాజ్ తరుణ్ తో తుగ్లక్ సినిమా మొదలైంది. ఆ నిర్మాత అడ్వాన్స్ లు ఇచ్చాడు. తర్వాత కథ నచ్చలేదు అని వేరే కథల కోసం వెతికాడు నిర్మాత. అప్పుడు రాజ్ తరుణ్ కి వరుస ఫ్లాప్స్ పడటంతో మార్కెట్ లేదు అని సినిమా ఆపేసాడు.
Also Read : Vassishta : మోసం చేయడంతో హీరోగా మారిన ‘విశ్వంభర’ డైరెక్టర్.. సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ..
ఆ తర్వాత నిర్మాత చిగురుపాటి చక్రి రాజ్ తరుణ్ కి చెప్పిన కథ ఏదో బాగుంది అంట కళ్యాణ్ రామ్ కి చెప్పు అని వశిష్టకు చెప్పాడు. అప్పటికే వశిష్ట కళ్యాణ్ రామ్ కి ఒక కథ చెప్పి వచ్చాడు. అది నచ్చినా నిర్మాతలు రాలేదు. మళ్ళీ ఛాన్స్ రావడంతో వెళ్లి రాజ్ తరుణ్ కి చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి చెప్పాడు. కళ్యాణ్ రామ్ కి కథ చెప్తే ఓకే చెప్పాడు. కానీ 25 కోట్లు బడ్జెట్ అవుద్ది, నాకు ఇప్పుడు మార్కెట్ లేదు. అందుకే నేనే నిర్మాతగా చేసుకుంటా. నాకు ఈ సినిమాలో నటనకు స్కోప్ ఉంది అని చెప్పి తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ కథని ఎన్టీఆర్ కి చెప్పిస్తే టైటిల్ మార్చమన్నారు. అలాగే ముస్లిం రాజు వద్దు, హిందూ రాజు బేస్డ్ కథ మార్చుకోండి అన్నారు. రెండు రోజుల్లో చరిత్ర అంతా వెతికి బింబిసార అనే రాజుని రిఫరెన్స్ తీసుకొని అదే టైటిల్ పెట్టుకున్నారు.
అప్పుడు కూడా మళ్ళీ కష్టాలే. 2018లో సినిమా మొదలుపెట్టారు. గెస్ట్ లు ఎవరు లేరు, నన్ను పిలిచి క్లాప్ కొట్టమన్నారు. షూట్ మొదలయ్యాక కరోనా వల్ల మొదలయిన నాలుగు రోజులకే సినిమా ఆగింది. కరోనా వల్ల చాలా లేట్ అయింది షూట్. నాలుగేళ్లు చేసి 2022 లో రిలీజ్ చేసారు. అప్పుడు కూడా పోటీకి సినిమాలు ఉన్నాయి అయినా హిట్ కొట్టింది. సినిమా రిలీజ్ ముందు వశిష్ట అని పేరు మార్చుకున్నాడు మా అబ్బాయి. అన్ని సిన్మాలు మొదలయి ఆగిపోయాయి అని పేరు మార్చుకుంటే కలిసొస్తుందని ఎవరో చెప్పడంతో మార్చుకున్నాను అని చెప్పినట్టు తెలిపారు.
పాపం వశిష్ట ఇంతమంది హీరోలతో సినిమా అనుకోని అన్ని మొదలయి ఆగిపోయాయా అని ఆశ్చర్యపోతున్నారు. చివరకు రాజ్ తరుణ్ చేయాల్సిన కథని మార్పులు చేర్పులు చేసి కళ్యాణ్ రామ్ తో తీసి హిట్ కొట్టి మొత్తానికి సాధించాడు వశిష్ట.