Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ ట్రైలర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట ట్రైలర్ యూ ట్యూబ్ లో విడుదలైన క్షణం నుంచి సంచలనం సృష్టిస్తోంది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉండగా..

Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ ట్రైలర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా?

Sarkaru Vaari Paata (1)

Updated On : May 3, 2022 / 3:20 PM IST

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట ట్రైలర్ యూ ట్యూబ్ లో విడుదలైన క్షణం నుంచి సంచలనం సృష్టిస్తోంది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉండగా.. అంచనాలకు తగ్గట్లే కట్ చేసిన ట్రైలర్ అభిమానులను, ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటూ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ ట్రైలర్ లో మహేష్ హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తూనే.. కీర్తి సురేష్ తో ప్రేమ కబుర్లు చెప్తూ.. ఎట్ ద సేమ్ టైమ్ సెటైర్లు వేస్తూనే యాక్షన్ మోడ్‌లో ఇరగదీశారు.

Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ పవర్ స్టార్?

సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుండగా.. ఈ ట్రైలర్ లో మహేష్ వేసిన సెటైర్లతో పాటు కీర్తి మహేష్ మధ్య కెమిస్ట్రీ గురించి కూడా అంతా మాట్లాడుకుంటున్నారు. కాగా.. ఇదే ట్రైలర్ కనిపించిన ఓ నటి గురించి కూడా ఇప్పుడు మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ట్రైలర్ లో కీర్తి సురేష్ తో పాటు మరో నటి కూడా హైలెట్ అవుతుంది. ట్రైలర్ లో రెండు మూడు సార్లు కనిపించిన ఈ నటి ఎవరా ఇంటర్నెట్ లో సెర్చ్ కూడా మొదలైంది.

Sarkaru Vaari Paata: మహేష్ నోట సీఎం జగన్ మాట.. పొలిటికల్ డైలాగ్‌కి లవ్ ఎఫెక్ట్!

ఎస్వీపీ ట్రైలర్ లో కనిపించిన ఈ నటి సౌమ్య మీనన్. చూసేందుకు నిధి అగర్వాల్ పోలికలు ఉన్న సౌమ్య మీనన్ మలయాళ నటి. మలయాళంలో అరడజను సినిమాలలో నటించిన సౌమ్య కన్నడలో హంటర్ అనే ఒక కన్నడ సినిమాలో నటించగా తెలుగులో కూడా టాక్సీ అనే సినిమాలో నటించింది. అది ఇంకా విడుదల కాలేదు. ఈలోగా మహేష్ ఎస్వీపీ ట్రైలర్ తో హైలెట్ అయింది. సౌమ్య నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. మలయాళంలో కొన్ని మ్యూజిక్ వీడియోలతో కూడా సందడి చేసింది.