KVR Mahendra : దొరసాని.. భరతనాట్యం.. డైరెక్టర్ KVR మహేంద్ర నెక్స్ట్ ఏంటి?
దొరసానిలో ప్రేమ, సామాజిక సమస్యలు చూపించిన మహేంద్ర భరతనాట్యంలో క్రైం, కామెడీ చూపించారు.

Dorasani Bharatanatyam Movies Director KVR Mahendra Next Movie Planning
KVR Mahendra : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కూతురు శివాత్మికలను పరిచయం చేస్తూ ‘దొరసాని’(Dorasani) లాంటి పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర. ఆ సినిమా మంచి విజయం సాధించింది. సినిమాలోని లవ్ స్టోరీ, సినిమాటోగ్రఫీ విజువల్స్ జనాలకు బాగా నచ్చాయి. దొరసాని లాంటి మంచి సినిమా తర్వాత అయిదేళ్ళు గ్యాప్ తీసుకొని ఇటీవల ‘భరతనాట్యం’ సినిమాతో వచ్చారు మహేంద్ర.
సూర్య తేజ, మీనాక్షి గోస్వామి.. లాంటి కొత్తవాళ్ళతో క్రైం కామెడీ సినిమాగా ‘భరతనాట్యం’ని(Bharatanatyam) తెరకెక్కించారు. ఇటీవల ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీతగా అనిపించినా సెకండ్ హాఫ్ లో డార్క్ కామెడీ, సస్పెన్స్ అంశాలతో మెప్పించారు. అయితే కథ బాగున్నా చిన్న ప్రొడక్షన్, కొత్త నిర్మాతలు కావడంతో లిమిట్ గా చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇదే కథ పెద్ద నిర్మాతల చేతిలో పడి ఉంటే ఇంకా మంచి అవుట్ పుట్ వచ్చేదని పలువురు ప్రేక్షకులు భావిస్తున్నారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’లో మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ఇంకెంతమందిని తీసుకొస్తాడో మంచు విష్ణు..
దొరసానిలో ప్రేమ, సామాజిక సమస్యలు చూపించిన మహేంద్ర భరతనాట్యంలో క్రైం, కామెడీ చూపించారు. రెండు సినిమాలు రెండు జానర్స్ లో తీసి మెప్పించాడు. మరి నెక్స్ట్ సినిమా ఎలాంటి కథతో రాబోతున్నాడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తన దగ్గర మూడు కథలు ఫైనల్ అయి ఉన్నాయని, అందులో రెండు పీరియాడిక్ క్రైం డ్రామా ఉన్నాయని, క్రైం జానర్ లో ఎక్కువ సినిమాలు తీయాలనుకుంటున్నానని కెవిఆర్ మహేంద్ర తెలిపారు. మొదటి రెండు సినిమాలు కొత్తవాళ్లతో చేసినా నెక్స్ట్ సినిమా మాత్రం పేరున్న హీరోతోనే చేయబోతున్నట్టు తెలిపారు. మరి నెక్స్ట్ కెవిఆర్ మహేంద్ర ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.