బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ట్విస్ట్: సీక్రెట్ రూమ్ లోకి రాహుల్.. హిమజ అవుట్

  • Published By: vamsi ,Published On : September 21, 2019 / 03:25 PM IST
బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ట్విస్ట్: సీక్రెట్ రూమ్ లోకి రాహుల్.. హిమజ అవుట్

Updated On : September 21, 2019 / 3:25 PM IST

సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలిమినేషన్ లో ముగ్గురు ఉన్న విషయం తెలిసిందే, హిమజ, మహేష్, రాహుల్ ఈ ముగ్గరు ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు. ప్రతీ వారం ఒక్కో హౌస్ మేట్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావటం జరుగుతుంది, కానీ ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు నాగార్జున ప్రకటించాడు. ఈ రోజు ఒక ఎలిమినేషన్, రేపు ఒక ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేశాడు.

ఇందులో భాగంగా ఈ రోజు ఎలిమినేషన్ లో రాహుల్ ని బయటకు పంపేశారు. శనివారమే ఈ తతంగమంతా జరిగింది. అయితే ఎలిమినేట్ అయిన రాహుల్ పూర్తిగా హౌస్ నుంచి వెళ్లిపోట్లేదు. ఒక రూమ్ లో రెండు రోజులు పాటు ఉండి తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఫస్ట్ సీజన్ లో ముమైత్ ఖాన్ ని ఉంచినట్లుగానే సీక్రెట్ రూమ్ లో ఉంచుతారు. అయితే రెండవ ఎలిమినేషన్ మాత్రం హిమజా.. నేరుగా వెళ్లిపోతుందట. చూడాలి మరి ఏం జరుగుతుందో.