ICU లో రాజశేఖర్.. హెల్త్ బులెటిన్ విడుదల.. కోలుకోవాలంటూ చిరు ట్వీట్..

  • Published By: sekhar ,Published On : October 22, 2020 / 01:29 PM IST
ICU లో రాజశేఖర్.. హెల్త్ బులెటిన్ విడుదల.. కోలుకోవాలంటూ చిరు ట్వీట్..

Updated On : October 22, 2020 / 6:57 PM IST

Rajasekhar Health Condition: యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరికీ ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈయన కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకోగా రాజశేఖర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. గురువారం ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం గురించి పలు వార్తలు వస్తుండడంతో తాజాగా సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

రాజశేఖర్ కు ఐసీయూలో చికిత్సనందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుంది. వైద్యానికి స్పందిస్తున్నారు అంటూ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు డాక్టర్లు తెలియజేశారు.

శివాత్మికకు ధైర్యం చెప్పిన చిరు

రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. శివాత్మిక ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. రాజశేఖర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా బయటకు రావాలని.. ధైర్యంగా ఉండాలని చిరు పేర్కొన్నారు.

తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యవద్దు- శివాత్మిక
శివాత్మిక తాజాగా మరో ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయం వద్దని సూచించింది. మీ ప్రేమకు, అభిమానానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. క్రమంగా మెరుగవుతోంది. మాకు కావాల్సింది మీ ప్రార్థనలు మాత్రమే. ఆయన ఆరోగ్యం విషయంలో భయం వద్దు. తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యవద్దు అని శివాత్మిక కోరింది.

Rajasekhar Health Bulletin