జీవిత డిశ్చార్జ్.. డా.రాజశేఖర్ హెల్త్ అప్‌డేట్..

  • Published By: sekhar ,Published On : October 24, 2020 / 03:58 PM IST
జీవిత డిశ్చార్జ్.. డా.రాజశేఖర్ హెల్త్ అప్‌డేట్..

Updated On : October 24, 2020 / 4:15 PM IST

Rajasekhar Health Update:  యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరూ ఇటీవల కరోనా బారిన పడ్డారు. కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకోగా జీవిత, రాజశేఖర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
తాజాగా రాజశేఖర్ ఆరోగ్యపరిస్థితికి సంబంధించి సిటీ న్యూరో సెంటర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

‘‘ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా వుంది.. వెంటిలేటర్ సపోర్ట్ లేకుండానే ఆయనకు చికిత్సనందిస్తున్నాం. అలాగే ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. జీవిత రాజశేఖర్‌కు కరోనా నెగిటివ్ రావడంతో ఆమె ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు’’.. అని తెలిపారు..

రత్న కిషోర్, మెడికల్ డైరెక్టర్
సిటీ న్యూరో సెంటర్ hyd

Rajasekhar Health Update

Shivani Rajasekhar