ED Summons : డ్రగ్స్ కేసు..ఈడీ రంగంలోకి దిగడానికి ప్రధాన కారణాలు ఇవే
డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది. విచారణకు హాజరుకావాలంటూ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.

Ed
Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. డ్రగ్స్ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది. విచారణకు హాజరుకావాలంటూ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో హీరో హీరోయిన్లు, దర్శకులు ఉన్నారు. వారందరినీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెలాఖరు నుంచే విచారణ షురూ చేయనుంది దర్యాప్తు సంస్థ. వచ్చే నెల 22లోగా సినీ స్టార్స్ విచారణ ముగించేలా ఈడీ సమన్లు జారీ చేసింది.
Read More : Bigg Boss 5: నేడు క్వారంటైన్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు!
డ్రగ్స్ కేసులో ఈడీ రంగంలోకి దిగడానికి ప్రధాన కారణాలు
ఎండీపీ యాక్ట్ ప్రకారం…డ్రగ్స్ నివారణ కోసం..కాకుండా…నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో..ఇతర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయ్యే వీలుంది. కానీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేవలం రాష్ట్ర పరిధిలో ఉన్న ఎక్సైజ్ శాఖ, సిట్ దర్యాప్తులకే పరిమితం చేయడంతో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ, సెంట్రల్ ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో దర్యాప్తు చేయించాలని ఆ పిటిషన్లలో కోరాయి. 2020 నవంబర్ ఎక్సైజ్ కమిషనర్ కు సమాచారం ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ కోర్టులో రాహుల్ సింఘానియా అఫిడవిట్ దాఖలు చేశారు.
Read More :Bullet Bandekki Song : ఫోన్‌లో బుల్లెట్టు బండి పాట పెడితేనే.. పాలు తాగుతోంది
2017లో :-
2017లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్ లు, ఛార్జిషీట్లు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కు ఈడీ లేఖ రాసింది. అయితే..తమకు ఎలాంటి సమాచారం రాలేదని గతంలో ఈడీ కోర్టుకు తెలిపింది. ఎక్సైజ్ శాఖ సేకరించిన స్టేట్మెంట్లు, డిజిటల్ పరికరాలు సాక్ష్యాలు, రిపోర్టు కాపీలు ఇవ్వాలని గతంలోనే హైకోర్టును ఈడీ కోరింది. ఎక్సైజ్ శాఖ నుంచి కేసుకు సంబంధించిన వివరాలు అందడంతో ఈడీ రంగంలోకి దిగింది. డ్రగ్స్ కేసులో పలువురు విదేశీయులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కింగ్ పిన్ కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ లాంటి సూత్రధారులను అరెస్టు చేయడంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
Read More : Mirwais Azizi : అఫ్గాన్ ఆయిల్ బిజినెస్ దిగ్గజం..తాలిబన్ల హయాంలోనూ తగ్గేదిలేదంటున్న వ్యాపారి
గోవా డ్రగ్ మాఫియా :-
వీళ్లంతా విదేశాలకు సంబంధించిన పౌరులుగా నిర్ధారించారు. గోవా డ్రగ్ మాఫియాతో వీరందరికీ మంచి సంబంధాలున్నట్లు తేలింది. సౌత్ ఇండియాలో సినిమా తారలు, ఐటీ కంపెనీలో ఉద్యోగులు, స్కూలు, కాలేజీ పిల్లల కేంద్రంగా డ్రగ్ మాఫియా పని చేస్తోందని అధికారులు గుర్తించారు.
విదేశీయులుగా ఉన్న పౌరులు నిందితులుగా ఉండడంతో మనీలాండరింగ్ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉండొచ్చనే ఆరోపణలు వినిపించాయి.
బ్లాక్‌మనీ ప్రమేయం ఉన్నప్పుడు.. నేరపూరిత చర్యల ద్వారా సంపాదించిన డబ్బును వ్యాపార లావాదేవీలకు ఉపయోగించినప్పుడు.. అక్రమపద్దతుల్లో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుంది.
Read More : Sidhu: సిద్ధూపై హైకమాండ్ సీరియస్.. హద్దుల్లో ఉండాలంటూ సీఎం వార్నింగ్!
ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ :-
మరి ఈ కేసులో కూడా ఇలాంటి లావాదేవీలే జరిగాయా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులే ఇప్పటి వరకూ తేలింది గోరంతేనా…? తేలాల్సింది కొండంత ఉందా అన్న చర్చ నడుస్తోంది. ఈడీ ఒక కేసులో ఎంటర్ అయ్యిందంటే మనీ ల్యాండరింగ్ యాక్ట్, ఫెమా చట్టం నిబంధనలు ఉల్లంఘించారని అర్ధం. కానీ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఈడీ విచారణపై సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ పిలిమనరీ ఎంక్వైరీలో భాగంగా అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న పలువురి బ్యాంకు అకౌంట్లపై ఆరా తీసింది.
Read More : Taliban Defence Minister: జైలు మాజీ ఖైదీయే అఫ్ఘాన్ రక్షణ మంత్రి
ఉచ్చు ఎవరికీ బిగుసుకుంటుంది ? :-
ఇందులో పలు ఆధారాలు సేకరించి, మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని తేల్చింది. అందులో భాగంగానే పలువురు సీనీ తారలకు నోటీసులు జారీ చేసింది. విదేశాల నుంచి ఫారెన్ కరెన్సీ ఇండియాకు తీసుకురావడం.. ఇక్కడి నుండి విదేశాలకు కరెన్సీని బదలాయించడం వంటి ఆధారాలు లభించడంతో.. ఈడీ ఈ కేసులో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చిక్కుముడులను ఈడీ విప్పడం స్టార్ట్ చేస్తే.. ఉచ్చు ఎవరికి బిగుసుకుంటుందన్నది తేలే అవకాశం ఉంది.