‘బాలు సార్ కోసం అందరం ప్రార్థనలు చేద్దాం’.. దేవిశ్రీ, థమన్..

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 09:02 PM IST
‘బాలు సార్ కోసం అందరం ప్రార్థనలు చేద్దాం’.. దేవిశ్రీ, థమన్..

Updated On : September 24, 2020 / 9:26 PM IST

SPB – DSP and Thaman S Tweets: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆసుపత్రి వర్గాలవారు వెల్లడించారు. ఆయనకు ఎక్మోతో పాటు ఇతర ప్రాణాధార చికిత్సనందిస్తున్నట్లు ఎంజీఎం అధికారికంగా ప్రకటించింది. దీంతో సంగీత ప్రపంచం అంతా ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు.

సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌, థమన్‌లు అందరూ బాలుగారి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరుతూ.. ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సోషల్‌ మీడియా ట్విట్టర్‌ ద్వారా కోరారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత కళాకారులు, బాలు అభిమానులు ఆయన కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.