Dulquer Salmaan: దుల్కర్ ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడా.. అసలు కమర్షియల్ సినిమా సెట్ అవుతుందా.. అవసరమా అంటున్నారు!

తెలుగులో పక్కా కమర్షియల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan).

Dulquer Salmaan: దుల్కర్ ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడా.. అసలు కమర్షియల్ సినిమా సెట్ అవుతుందా.. అవసరమా అంటున్నారు!

Dulquer Salmaan doing his next film with director Sampath Nandi

Updated On : January 1, 2026 / 6:26 PM IST
  • తెలుగులో దుల్కర్ కొత్త సినిమా
  • పక్కా కమర్షియల్ డైరెక్టర్ కి ఛాన్స్
  • పీపుల్ మీడియా బ్యానర్ లో త్వరలోనే స్టార్ట్

Dulquer Salmaan: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా కొద్దీ మంది హీరోలు మాత్రమే స్పెషల్ సినిమాలు చేస్తూ ఉంటారు. అందుకే, ఆడియన్స్ వారి సినిమాల పట్ల చాలా ఆసక్తిగా ఉంటారు. ఎప్పుడెప్పుడు వాళ్ళ సినిమాలు వస్తాయా అని. ఆలా పేరు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. నిజాంగా ఈ హీరో చాలా స్పెషల్. అలాగే పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ కి కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

ఎందుకంటే.. దుల్కర్(Dulquer Salmaan) మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరో కానీ.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషలో దర్శకులు ఈయనతో డైరెక్ట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆలాగే, ఈ హీరో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటాడు. తెలుగు విషయానికి వస్తే, ఇక్కడ ఈ హీరో అన్నీ స్పషల్ సినిమాలు మాత్రమే చేశాడు. వాటిలో.. మహానటి, సీతారా మం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు ఉన్నాయి.

Lenin First Single: అఖిల్ ‘లెనిన్’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్

ఈ సినిమాల్లో దేనికదే ప్రత్యేకం. ఇప్పుడు రాబోతున్న ఆకాశంలో ఒక తార అనే సినిమా కూడా స్పెషల్ మూవీనే. ఇలాంటి హీరో ఇప్పుడు పక్క కమర్షియల్ సినిమాలు చేసే దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు సంపత్ నంది. ఏమైంది ఈవేళ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు ఆ తరువాత రచ్చ, గౌతమ్ నంద, సిటీమార్ లాంటి కమర్షియల్ సినిమాలు మాత్రమే చేశాడు. కానీ, వాటిలో రచ్చ తప్పితే మిగతావి ప్లాప్ అయ్యాయి.

ఈ దర్శకుడు రీసెంట్ గా దుల్కర్ కోసం ఒక కథను సిద్ధం చేశాడట. రీసెంట్ గా ఆ కథను దుల్కర్ కి వినిపించగా ఆయనకు బాగా నచ్చిందట. వెంటనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట దుల్కర్. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తోంది. అయితే, ఈ న్యూస్ తెలుసుకున్న దుల్కర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిజప్పాయింట్ గా ఉన్నారట.

ఎందుకంటే, సంపత్ నందికి ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా లేదు. కనీసం, ఆయన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకునేలా ఉండవు. ఈ టైంలో అలంటి దర్శకుడితో సినిమా అవసరమా అనుకుంటున్నారట. మరి ఫైనల్ గా దుల్కర్ ఈ సినిమా విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది చూడాలి.