Dulquer Salmaan : మహానటి కోసం వచ్చినప్పుడు నాకు తెలుగు రాదు అన్నాను.. కానీ ఇవాళ.. లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో దుల్కర్ వ్యాఖ్యలు..
తాజాగా లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

Dulquer Salmaan Interesting Comments in Lucky Baskhar Success Meet
Dulquer Salmaan : మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో హిట్స్ కొట్టి ఇప్పుడు దీపావళికి లక్కీ భాస్కర్ సినిమాతో వచ్చి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా ఆల్మోస్ట్ 40 కోట్లు వసూలు చేసింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన రిలీజయి మంచి హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మూవీ యూనిట్ తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి.. పలువురు పాల్గొన్నారు.
లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తనతో నటించిన వారందరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పారు. అలాగే.. సాయి కుమార్ గారి వాయిస్ అనేది ఆయనకు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకి బ్లెస్సింగ్. నా చిన్నప్పుడు రాంకీ గారి నటన అంటే ఇష్టం. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా ఆదరిస్తున్నారు. మీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాగి, స్వప్న ‘మహానటి’ సినిమా కోసం మొదటి సారి నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తెలుగు రాదు అన్నాను. కానీ నన్ను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టారు. తర్వాత హను గారు ‘సీతారామం’ సినిమాతో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు. ఇప్పుడు వెంకీ.. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ చాలా ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి ధన్యవాదాలు అని అన్నారు.
Also Read : Taapsee Pannu : హీరోలని డామినేట్ చెయ్యకుండా ఉండే హీరోయిన్లనే తీసుకుంటారు.. తాప్సి షాకింగ్ కామెంట్స్
ఈ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. నేను ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేసి హిట్స్ కొట్టాను. ఇప్పుడు వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నాకు వెంకీ అట్లూరిపై చాలా గౌరవం పెరిగింది. ప్రేమ కథలతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వెంకీ సార్ సినిమా నుంచి రూట్ మార్చాడు. ఈ సినిమాలో తను రాసిన డైలాగ్ లకు, క్యారెక్టర్లను హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్. దుల్కర్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగులో మూడు సినిమాలు మూడు క్లాసిక్స్. టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమా ఇచ్చారు అని అన్నారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. నాకు వెంకీ ఎప్పటినుంచో తెలుసు. సినీ పరిశ్రమలో ఎంతో జీవితాన్ని చూశాడు. అందుకే ఇప్పుడు ఇంతమంచి సినిమాలు చేస్తున్నాడు. వెంకీ, దుల్కర్ కలిసి లక్కీ భాస్కర్ చేయడం, అది పెద్ద హిట్ అవ్వడం సంతోషంగా ఉంది అని అన్నారు.
డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ.. తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. వెంకీ సార్ సినిమా నుంచి నచ్చడం మొదలెట్టాడు. తను ముందు చేసిన లవ్ స్టోరీలు లాంటివి చాలామంది చేశారు. కానీ సార్ సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకొచ్చి అంత హృద్యంగా చెప్పడం గ్రేట్. ఆ సినిమా చూసి నేను ఏడ్చాను. అప్పటినుంచి నేను వెంకీకి ఫ్యాన్ అయ్యాను. మా అమ్మగారు, అమ్మమ్మగారు లక్కీ భాస్కర్ సినిమా చూసి.. నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా, ప్రేమకథలు కాదు ఇలాంటి పనికొచ్చే సినిమాలు చేయమని చెప్పారు. 70-80 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా సినిమా గురించి ఇలా మాట్లాడటం గొప్ప విషయం అని అన్నారు.

ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. మూవీలో పనిచేసిన అందరికి పేరుపేరునా థ్యాంక్స్ చెప్పాడు. నాగ్ అశ్విన్, హను గారిని ఇక్కడ చూడటం సంతోషంగా ఉంది. నేను నటుడిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా కోసం హను గారు నన్ను ఆడిషన్ చేశారు. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అప్పుడు నాగి నన్ను ఆడిషన్ చేశాడు. ఇప్పుడు మేము ముగ్గురం దుల్కర్ గారితో సినిమాలు చేసి హిట్లు కొట్టాం. లక్కీ భాస్కర్ తో పాటు దీపావళికి విడుదలైన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకే ఒకేసారి మూడు మంచి సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏబీసీడీ సినిమా చూసినప్పటి నుంచి దుల్కర్ గారితో పని చేయాలనుకున్నాను. ఇప్పుడు లక్కీ భాస్కర్ తో ఆ కోరిక తీరింది. కథ విన్న వెంటనే ఆలోచించకుండా సినిమా చేయడానికి అంగీకరించారు దుల్కర్ గారు అని అన్నారు.