Lucky Baskhar Trailer : దుల్కర్ సల్మాన్ ‘ల‌క్కీ భాస్క‌ర్’ ట్రైలర్‌..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ న‌టిస్తున్న మూవీ ల‌క్కీ భాస్క‌ర్‌.

Lucky Baskhar Trailer : దుల్కర్ సల్మాన్ ‘ల‌క్కీ భాస్క‌ర్’ ట్రైలర్‌..

Updated On : October 21, 2024 / 6:54 PM IST

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ న‌టిస్తున్న మూవీ ల‌క్కీ భాస్క‌ర్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మీనాక్షి చౌదరి క‌థానాయిక‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజర్, పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్న‌ ఈ మూవీ దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Kanguva Second Song : సూర్య కంగువా నుంచి రెండో పాట.. దిశ‌తో సూర్య సెప్టులు అదుర్స్‌