ఎన్నాళ్లో వేచిన ఉదయం.. దుల్కర్ తెలుగు సినిమా..

దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో సినిమా..

  • Published By: sekhar ,Published On : May 7, 2020 / 11:26 AM IST
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. దుల్కర్ తెలుగు సినిమా..

Updated On : May 7, 2020 / 11:26 AM IST

దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో సినిమా..

తమ బ్యానర్లో ‘మహానటి’ వంటి మెమరబుల్ మూవీలో నటించిన మలయాళ యంగ్ హీరో, మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీ దత్ చెప్పారు.

ఈ సినిమాకు ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలతో ఆకట్టుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నారు.  వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ స్వప్న సినిమా పతాకంపై నిర్మించనున్నామని దత్ తెలిపారు. ఎప్పటినుండో నేరుగా తెలుగులో సినిమా చేయాలనకుంటున్న దుల్కర్ కోరిక ఇప్పటికి తీరబోతుంది.

Also Read | జ్వాలను ఫస్ట్ టైం అక్కడ చూశా.. ఫ్లాట్ అయిపోయా..