Dulquer Salman : మలయాళ నిర్మాతలతో ఇబ్బందులు పడ్డాను.. అందుకే నేనే నిర్మాతగా మారాను.. తెలుగు నిర్మాతలు..

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలయాళం నిర్మాతలతో పడ్డ ఇబ్బందులు, తెలుగు నిర్మాతల గురించి, అసలు తాను ఎందుకు నిర్మాతగా మారాడో చెప్పాడు.

Dulquer Salman : మలయాళ నిర్మాతలతో ఇబ్బందులు పడ్డాను.. అందుకే నేనే నిర్మాతగా మారాను.. తెలుగు నిర్మాతలు..

Dulquer Salman sensational comments on Malayalam Producers and appreciate Telugu Producers

Dulquer Salman :  మలయాళం(Malayalam) స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగులో కూడా మహానటి, సీతారామం(Sita Ramam) సినిమాలతో హిట్స్ కొట్టి మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు కింగ్ అఫ్ కొత్త(King of Kotha) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు దుల్కర్. ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి దుల్కర్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలయాళం నిర్మాతలతో పడ్డ ఇబ్బందులు, తెలుగు నిర్మాతల గురించి, అసలు తాను ఎందుకు నిర్మాతగా మారాడో చెప్పాడు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. మలయాళంలో సినిమాలు చేస్తుంటే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నా సినిమాలని నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఏవో కారణాలతో కొందరు నిర్మాతలు అనుకున్న బడ్జెట్ ని సమకూర్చలేకపోవడం, సరిగ్గా విడుదల చేయలేకపోవడం జరగడంతో నా సినిమాలకి నష్టం వచ్చేది. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యుషన్ లో ఉండాలని వేఫేరర్ ఫిల్మ్స్ ని ప్రారంభించి నిర్మాతగా మారాను. ఈ బ్యానర్ పై ప్రస్తుతం నా సినిమాలు నిర్మిస్తున్నాను. త్వరలో వేరే సినిమాలు కూడా నిర్మిస్తాను అని తెలిపారు.

NTR Kalyan Ram : మేనల్లుడి పెళ్ళిలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందడి.. మనవడి కోసం వచ్చిన బాలయ్య

తెలుగులో సినిమాలను నిర్మిస్తారా అని అడగ్గా.. ఇక్కడ మంచి నిర్మాతలు ఉన్నారు. ఇక్కడ నా అవసరం ఉండదనే భావిస్తాను. అయితే సినిమాని బట్టి, దానికి అవసరమైనప్పుడు నిర్మాణంలో సపోర్ట్ కావాలంటే మాత్రం చేస్తాను. ‘కాంత’ సినిమా నేను, రానా కలసి నిర్మిస్తున్నాం. సినిమా పట్ల నాకు తనకి ఒకేరకమైన ఆలోచనలు ఉంటాయి. ‘లక్కీ భాస్కర్’ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. వాళ్ళు చాలా మంచి ప్రోడ్యుసర్స్. ఇక వైజయంతి మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దత్ గారు, స్వప్న గారు నాకంటే గొప్పగా ఆలోచిస్తారు. నిర్మాతగా నేను వాళ్ళ నుంచి, మిగతా వాళ్ళ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని మలయాళంలో వాటిని అనుసరిస్తున్నాను అని తెలిపారు. మరి దుల్కర్ చేసిన కామెంట్స్ పై మలయాళం నిర్మాతలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.