Mammootty: “మమ్ముట్టి”తో కలిసి నటించడం.. తన జీవిత లక్ష్యం అంటున్న స్టార్ హీరో..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు, తమిళ, హిందీ భాషలోని పలు సినిమాలో కూడా నటించి మెప్పించారు. మూడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న 'మమ్ముట్టి'తో నటించాలన్నది తన జీవిత ఆశయం అంటున్నాడు ఒక యువ హీరో. అతడెవరో కాదండి..

Mammootty: “మమ్ముట్టి”తో కలిసి నటించడం.. తన జీవిత లక్ష్యం అంటున్న స్టార్ హీరో..

Dulquer Salman Wants to Act with Mammootty

Updated On : September 25, 2022 / 10:30 AM IST

Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు, తమిళ, హిందీ భాషలోని పలు సినిమాలో కూడా నటించి మెప్పించారు. కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన “స్వాతికిరణం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ నటుడు, ఇటీవల ‘వైస్సార్’ బయోపిక్ తోను మరోసారి పలకరించారు.

Dulquer Salmaan : సీతారామం సీక్వెల్ ఉండదు.. నేను సీక్వెల్స్, రీమేక్స్ చేయను..

మూడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ‘మమ్ముట్టి’తో నటించాలన్నది తన జీవిత ఆశయం అంటున్నాడు ఒక యువ హీరో. అతడెవరో కాదండి.. మమ్ముట్టి వారసుడిగా వెండితెరకు పరిచయమైన ‘దుల్క్యూర్ సల్మాన్’. తన తండ్రి సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో విమర్శలు ఎదురుకున్నా.. అవేవి పట్టించుకోకుండా నేడు ఇంత స్థాయికి ఎదిగారంటూ ఒక్క ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

అలాగే తన తండ్రితో ఇప్పటివరకు నటించే ఛాన్స్ రాలేదని, ఆయనతో నటించడానికి నేను ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన హిందీ మూవీ “చుప్” విడుదల కాగా, సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరి దుల్క్యూర్ సల్మాన్ కోరికను ఏ డైరెక్టర్ నెరవేరుస్తాడో చూడాలి.