Evaru MeeloKoteeswarulu : ‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా’..

ఎన్టీఆర్‌ని ఎప్పుడెప్పుడు స్మాల్ స్క్రీన్ మీద చూద్దామా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌కి క్లారిటీ ఇస్తూ రీసెంట్‌గా టెలికాస్ట్ డేట్‌తో ప్రోమో వదిలారు..

Evaru MeeloKoteeswarulu : ‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా’..

Evaru Meelokoteeswarulu

Updated On : August 14, 2021 / 1:38 PM IST

Evaru MeeloKoteeswarulu: ‘ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు’.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఆగస్టులోనే బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్నారు. ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ తర్వాత తారక్ హోస్ట్ చేస్తున్న ఈ క్రేజీ రియాలిటీ షోపై భారీ అంచనాలున్నాయి..

Evaru MeeloKoteeswarulu : ‘మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఎమోషనల్‌గా ఆకట్టుకోవడంతో పాటు తారక్ హోస్టింగ్ ఎలా ఉండబోతుందంటూ ప్రేక్షకాభిమానుల్లో క్యూరియాసిటీ కలిగింది. ఎన్టీఆర్‌ని ఎప్పుడెప్పుడు స్మాల్ స్క్రీన్ మీద చూద్దామా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌కి క్లారిటీ ఇస్తూ జెమిని టీవీ వారు రీసెంట్‌గా టెలికాస్ట్ డేట్‌తో ప్రోమో వదిలారు.

Evaru Meelo Koteeswarulu : స్పెషల్ డే.. ఫస్ట్ ఎపిసోడ్..

‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. సోమవారం నుంచి గురువారం వరకు.. ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. మీ జెమిని టీవీలో.. అంటూ వదిలిన రివీలింగ్ ప్రోమో వైరల్ అవుతోంది. ఆగస్టు 22 రాత్రి 8:30 గంటలకు కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌తో ఈ క్రేజీ రియాలిటీ షో స్టార్ట్ కానుంది. ఆగస్టు 23 నుండి సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో టెలికాస్ట్ కానుంది.

Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…

120 దేశాల్లో కామన్ మ్యాన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పాపులర్ షో ను ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో సన్ నెట్‌వర్క్, జెమిని టీవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది.