Oscars95 : ఆస్కార్ 2023లో ఎక్కువ అవార్డులు అందుకున్న సినిమా ఏదో తెలుసా?
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్స్ లో ఒక సినిమా దాదాపు ఆస్కార్స్ ని కైవసం చేసుకుంది. ఏంటి ఆ సినిమా?

Everywhere All at Once,All Quiet on the Western Front bagging so many oscar awards in 95th academy awards
Oscars95 : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ అవార్డు నామినేషన్స్ లో ప్రపంచంలోని టాప్ మూవీస్ అన్ని ఆస్కార్ కోసం పోటీ పడ్డాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు ఒకటి కంటే ఎక్కువ అవార్డులు అందుకున్నాయి.
అమెరికన్ సైకలాజికల్ డ్రామా ‘ది వేల్’ (The Whale) మూవీ రెండు ఆస్కార్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. ‘మమ్మీ’ సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ‘బ్రెండన్ ఫ్రేజర్’.. ది వేల్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకున్నాడు. అలాగే ఇదే సినిమాకు మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో కూడా అవార్డుని అందుకుంది. ఈ చిత్రం తరువాత ఎక్కువ అవార్డులు అందుకున్న సినిమా ‘అల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ (All Quiet on the Western Front). బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో నాలుగు ఆస్కార్ అవార్డ్స్ ని సొంత చేసుకుంది. వరల్డ్ వార్ 1 నేపథ్యంతో వచ్చిన ఈ జర్మన్ మూవీని ఎడ్వర్డ్ బెర్గెర్ డైరెక్ట్ చేశాడు.
Oscars95 : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఇరగొట్టేశారు!
ఇక ఆస్కార్ లో అత్యధిక అవార్డులు అందుకున్న చిత్రం ఎవరీ థింగ్ ఎవరీ వేర్ అల్ ఎట్ ఒన్స్ (Everything Everywhere All at Once). మొత్తం 7 కేటగిరీలో ఈ సినిమా అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డ్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్ లో కూడా ఈ సినిమా అధిక స్థాయిలో అవార్డులను అందుకుంటూ వచ్చింది. ఈ సినిమాని డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్ రచించి, డైరెక్ట్ చేశారు. మిచెల్ యో మెయిన్ లీడ్ లో నటించగా.. కే హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ ప్రధాన పత్రాలు పోషించారు. మల్టీవర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.