Manchu Manoj: “మనోజ్-మౌనిక”ల బంధం ఈనాటిది కాదు.. సంచలన నిజాలు బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే గోనె
సినిమా పరిశ్రమలో ఉన్న సెలెబ్రెటీస్ విడాకుల తీసుకోవడం కొత్తేమి కాదు. నాగార్జున నుంచి నాగచైతన్య వరకు ఎంతోమంది విడాకులు తీసుకున్నవారే. ఆ కోవలోనే మంచు వారసుడు మంచు మనోజ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి విషయం గురించి పిల్మ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Ex MLA Gone Prakash Comments on Manchu Manoj Bhuma Naga Mounika Love Story
Manchu Manoj: సినిమా పరిశ్రమలో ఉన్న సెలెబ్రెటీస్ విడాకుల తీసుకోవడం కొత్తేమి కాదు. నాగార్జున నుంచి నాగచైతన్య వరకు ఎంతోమంది విడాకులు తీసుకున్నవారే. ఆ కోవలోనే మంచు వారసుడు మంచు మనోజ్ కూడా ఉన్నాడు. 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్, 2019 లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి విషయం గురించి పిల్మ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మంచు మనోజ్ రెండో పెళ్లిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.. మనోజ్, మౌనిక ల బంధం ఈనాటిది కాదు. మౌనికతో మనోజ్ కి మొదటి నుంచి మంచి స్నేహం ఉండడం, అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లడం కూడా జరిగింది. కాకపోతే దాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించడంతో అది అక్కడితో ఆపేసి, ఎవరికి వారు విడిగా పెళ్లి చేసుకున్నారు.
ఆ తరువాత మనోజ్ కు డైవర్స్ కావడం, భూమా మౌనిక కూడా ఒక కుమారుడు పుట్టిన తరువాత డైవర్స్ తీసుకోవడంతో వీళ్లిద్దరికీ మళ్ళీ రూట్ క్లియర్ అయ్యింది. అంతే కాదు మనోజ్-మౌనిక లు చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారనేది రెండు కుటుంబాలకు మాత్రమే కాదు, రాయలసీమలో లక్షలాది మందికి, హైదరాబాద్ లో ఉన్న సినిమావాళ్లకు కూడా తెలిసిన నిజమే” అంటూ గోనే చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల ఈ జంట సీతాఫల్‌మండిలోని ఓ గణేష్ మండపాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే.