అల్లుళ్ళకి లైన్ క్లియర్

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఎఫ్2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

  • Published By: sekhar ,Published On : January 5, 2019 / 05:46 AM IST
అల్లుళ్ళకి లైన్ క్లియర్

Updated On : January 5, 2019 / 5:46 AM IST

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఎఫ్2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న  ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్, సంక్రాంతికి రిలీజవబోతోంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కి ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. నిన్ననే ఎఫ్2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఎఫ్2 మూవీ చూసిన సెన్సార్ సభ్యులు, ఎటువంటి కట్స్ చెప్పకుండా, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

వెంకీకి జంటగా మిల్కీబ్యూటీ తమన్నా, వరుణ్‌కి జోడీగా మెహరీన్ నటించగా, దేవిశ్రీ మ్యూజిక్ అందిచాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, శతమానం భవతి వంటి సంక్రాంతి హిట్స్ తర్వాత దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడం, అనిల్, దిల్ రాజుల కాంబోలో, సుప్రీమ్, రాజా ది గ్రేట్ తర్వాత రూపొందిన సినిమా కావడంతో, ఎఫ్2 హ్యాట్రిక్ సినిమా అవుతుందని మూవీ యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది.  

వాచ్ టీజర్…
 

F2 Gets U/A Certificate