Allu Arjun: అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం..! అల్లు అర్జున్ కార్యాలయం సీరియస్
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ధృవీకరించని కంటెంట్‌ను షేర్ చేయకుండా ఉండాలని కోరింది.
Allu Arjun Representative Image (Image Credit To Original Source)
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అల్లు అర్జున్ కార్యాలయం సీరియస్ అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. అల్లు అర్జున్ గురించి నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేస్తున్న ఇటీవలి వీడియో పూర్తిగా అబద్ధం అని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ధృవీకరించని కంటెంట్‌ను షేర్ చేయకుండా ఉండాలని కోరింది.
”ఇటీవల అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ పూర్తిగా నిరాధారం, అవాస్తవం. అతను ఎల్లప్పుడూ అత్యంత గౌరవంగా ప్రవర్తించాడు. ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యల తీసుకునేందుకు మా లీగల్ టీమ్ ప్రాసెస్ట్ స్టార్ట్ చేసింది. ధృవీకరించని అటువంటి కంటెంట్ ను ఎవరూ కూడా షేర్ చేయొద్దని కోరుతున్నాం” అని అల్లు అర్జున్ బృందం తన అధికారిక ప్రకటనలో తెలిపింది.
An official note from Icon star @alluarjun’s Office.
A recent video spreading baseless allegations about @alluarjun is completely false. The matter is being taken seriously, and legal action is being initiated against those responsible. Kindly refrain from sharing unverified… pic.twitter.com/sXhSNRsB36— Team Allu Arjun (@TeamAAOfficial) February 10, 2026
