నా ఫ్యామిలీ ఇదే : భార్య, కూతురిని పరిచయం చేసిన యాంకర్ రవి

నా ఫ్యామిలీ ఇదే : భార్య, కూతురిని పరిచయం చేసిన యాంకర్ రవి

Updated On : February 4, 2019 / 6:38 AM IST

విమర్శల తుఫాన్‌కు తెరదించుతూ.. వివాదాలకు సమాధానంగా తన ఫ్యామిలీ ఫొటోను బయటపెట్టాడు యాంకర్ రవి. గతంలో లాస్యతో విభేదాలు జరిగినప్పుడు పర్సనల్ విషయాలు వెల్లడించని రవి ఆదివారం ట్విట్టర్ ఖాతా ద్వారా తన భార్య నిత్య సక్సేనాతో పాటు కూతురు బేబీ వియా ఉన్న ఫొటోను షేర్ చేశాడు. 

లాస్యతో అఫైర్ ఉందంటూ రవి తనని మోసం చేశాడంటూ లాస్య చాలా సార్లు మీడియా ముందు బాధను వెల్లగక్కింది. తన కెరీర్ నాశనం అవడానికి రవినే కారణమంటూ ఆరోపణలు గుప్పించింది. వాటికి మండిపడ్డ రవి పర్సనల్ విషయాలు తన అనుమతి లేకుండా ఎలా షేర్ చేసుకుంటుందంటూ ప్రశ్నించాడే కానీ, పెద్దగా స్పందించలేదు. 

ఆ తర్వాత శ్రీ ముఖితో చేస్తున్న పటాస్ షోలోనూ చనువుగా ఉంటున్న రవి పట్ల అందరూ వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ చెవులు కొరుక్కున్నారు. వాటన్నిటికీ ఆదివారం రవి బయటపెట్టిన ఫొటో సమాధానంగా కనిపిస్తుంది.