DOP KU Mohanan : ‘ఫ్యామిలీ స్టార్’ కెమెరామెన్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న.. సినిమా కథ చెప్పేసి..

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాకి కెమెరామెన్ గా చేసింది ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న అని మీకు తెలుసా..!

DOP KU Mohanan : ‘ఫ్యామిలీ స్టార్’ కెమెరామెన్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న.. సినిమా కథ చెప్పేసి..

Family star DOP KU Mohanan is a father of malavika mohanan

Updated On : March 27, 2024 / 6:27 PM IST

DOP KU Mohanan : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి కెమెరామెన్ గా పనిచేసింది ఎవరో తెలుసా?

ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఇండియాలోనే టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన KU మోహనన్ పనిచేసారు. బాలీవుడ్ లో డాన్, తలాష్, లస్ట్ స్టోరీస్.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. తెలుగులో గతంలో మహేష్ బాబు మహర్షి సినిమాకు పనిచేసారు. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ స్టార్ సినిమాతో వస్తున్నారు. అయితే KU మోహనన్ కూతురు హీరోయిన్ మాళవిక మోహనన్. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తమిళ్, మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా తెలుగు వారికి కూడా పరిచయమైన మాళవిక మోహనన్ త్వరలో ప్రభాస్ సరసన ది రాజా సాబ్ సినిమాతో రాబోతుంది.

Also read : Ram Charan : పుట్టినరోజునే రామ్ చరణ్ న్యూ రికార్డు.. నాలుగు రోజుల్లో ఇంత ఫాలోయింగా..

Family star DOP KU Mohanan is a father of malavika mohanan

తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా KU మోహనన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. KU మోహనన్ ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక మిడిల్ క్లాస్ కథ. హీరో తన ఫ్యామిలీ కోసం ఏం చేశాడు అనే ఒక మంచి మెసేజ్ తో ఉంటుంది. ఈ సినిమా కోసం నిజంగా ఒక మిడిల్ క్లాస్ కనపడేలా సెట్స్ వేసాం. సినిమా విజువల్స్ చాలా అందంగా వచ్చాయి. మనం నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి ఈ సినిమా చెప్తుంది. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారిపోతున్నారు. అందరు కలిసి ఉండట్లేదు. మన ఓల్డ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి ఈ సినిమాలో చూపెట్టబోతున్నారు. ఒక ప్రేమ కథతో పాటు మంచి ఇండియన్ ఫ్యామిలీ స్టోరీ అవుతుంది ఈ సినిమా అని తెలిపారు.

విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. విజయ్ చాలా న్యాచురల్ యాక్టర్. అతని నటనలో ఎక్కువ డ్రమాటిక్ ఉండదు. నాకు విజయ్ యాక్టింగ్ నచ్చుతుంది. మృణాల్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. పరుశురాం సినిమాపై చాలా క్లారిటీగా ఉన్నాడు అని తెలిపారు.

Family star DOP KU Mohanan is a father of malavika mohanan

తన కూతురు మాళవిక మోహనన్ గురించి మాట్లాడుతూ.. మాళవిక తనకు తానుగా గుర్తింపు తెచ్చుకుంది. నేను ఆమెని ఏ సినిమాకు రికమెండ్ చేయలేదు. అలా చేయడం కరెక్ట్ కాదు. నటిగా తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. తన కథల విషయంలో కూడా నేను జోక్యం చేసుకోను. విక్రమ్ తంగలాన్ సినిమా మాళవికకు మంచి పేరు తీసుకొస్తుంది అని తెలిపారు. దీంతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో కుటుంబ విలువల గురించి ఒక మంచి మెసేజ్ ఉండబోతుందని తెలుస్తుంది.