Manchu Lakshmi : ఏడుస్తూ మంచు లక్ష్మి కాళ్ళ మీద పడ్డ అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో..

ప్రెస్ మీట్ లో మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఓ అభిమాని ఏడ్చుకుంటూ స్టేజిపైకి వచ్చి మంచు లక్ష్మి కాళ్ళ మీద పడ్డాడు.

Manchu Lakshmi : ఏడుస్తూ మంచు లక్ష్మి కాళ్ళ మీద పడ్డ అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో..

Fan fell on Manchu Lakshmi Feet on stage at middle of Press Meet Video goes Viral

Updated On : March 19, 2024 / 3:30 PM IST

Manchu Lakshmi : అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో హీరోల కోసం, హీరోలతో ఫోటోల కోసం కొంతమంది అభిమానులు స్టేజిపైకి సడెన్ గా వచ్చి హంగామా సృస్టిస్తారు. అప్పుడప్పుడు పలు ఈవెంట్స్ లో ఈ ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఘటన మరోసారి జరిగింది. అయితే ఈ సారి నటి మంచు లక్ష్మికి ఈ ఘటన జరగడం గమనార్హం.

త్వరలో మంచు లక్ష్మి ఆదిపర్వం అనే సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఓ అభిమాని ఏడ్చుకుంటూ స్టేజిపైకి వచ్చి మంచు లక్ష్మి కాళ్ళ మీద పడ్డాడు. ఈ ఘటనపై మంచు లక్ష్మి ఆశ్చర్యపోయింది. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. బౌన్సర్లు వెంటనే పైకి వచ్చి ఆ అభిమానిని కిందకి తీసుకెళ్లారు.

Also Read : Lokesh Kanagaraj : శ్రుతి హాసన్ కోసం నటుడిగా మారుతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

ఈవెంట్ అయి బయటకి వచ్చాక మంచు లక్ష్మి ఆ అబ్బాయికి ఫొటో ఇచ్చింది. ఆ సమయంలో కూడా అతను ఏడుస్తూ కనపడటంతో మంచు లక్ష్మి అతన్ని ఓదార్చి ఫొటో ఇచ్చి వెళ్ళిపోయింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. ఒక నటి కోసం అలా పైకెక్కి కాళ్ళ మీద పడటం ఏంటి, కావాలని చేశారా, ఏడవడం ఎందుకు అని పలువురు ట్రోల్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం మంచు లక్ష్మి చేసే సహాయ కార్యక్రమాల్లో అతనికి ఏమైనా హెల్ప్ అయిందేమో అందుకే అలా చేసాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మి సినీ పరిశ్రమకి పరిచయమైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, యాంకర్ గా, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మంచు లక్ష్మి పాపులర్ అయింది. ఇక తన ఇంటర్వ్యూలు, తన స్పీచ్ లలో తాను మాట్లాడే మాటలతో బాగా ట్రోల్ అయింది. అయినా మంచు లక్ష్మి అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది మంచు లక్ష్మి.