Faria Abdullah : ఆ కార్ డ్రైవర్ చిన్నప్పటి చిట్టి నేనేనేమో అనుకున్నాడు.. రోడ్డు మధ్యలో కార్ ఆపేసి..
లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా అలీతో సరదాగా కార్యక్రమానికి హీరో, దర్శకుడితో కలిసి వచ్చింది. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది ఫరియా. జాతిరత్నాలు తర్వాత తనకి జరిగిన ఓ సంఘటనని షేర్ చేసుకుంది...........

Faria Abdullah shares funny incident in Ali tho Saradaga Program
Faria Abdullah : ఫరియా అబ్దుల్లా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ చిట్టి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు తనని. జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో అందంగా అలరించి అభిమానులని సంపాదించుకుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఫరియా. బయట ఎక్కడికి వెళ్లినా తనని ఇంకా చిట్టి అనే పిలుస్తున్నారు. ప్రస్తుతం తను సంతోష్ శోభన్ తో కలిసి లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ సినిమాతో రాబోతుంది.
లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా అలీతో సరదాగా కార్యక్రమానికి హీరో, దర్శకుడితో కలిసి వచ్చింది. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది ఫరియా. జాతిరత్నాలు తర్వాత తనకి జరిగిన ఓ సంఘటనని షేర్ చేసుకుంది.
Chiranjeevi : అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి.. DAV స్కూల్ ఘటనపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..
ఫరియా మాట్లాడుతూ.. ”ఓ సారి క్యాబ్ లో వెళ్తున్నాను. డ్రైవర్ డల్ గా ఉన్నాడు. ఏమైంది అన్నా అని మాట్లాడటం మొదలు పెట్టాను. తన చిన్నప్పటి క్రష్ చిట్టి అని, తన గురించి చెప్తూ బాధపడ్డాడు. ఓ అవునా అని నేను నా పేరు కూడా చిట్టినే అని చెప్పాను. వెంటనే రోడ్డు మధ్యలో కార్ ఆపేసి వెనక్కి తిరిగి ఏ స్కూల్ మీరు అని అడిగాడు. నేను షాక్ అయ్యాను. తన చిన్నప్పటి చిట్టి నేనేనేమో అనుకున్నాడు. మళ్ళీ నా అసలు పేరు చెప్పి, ఇది సినిమాలో పేరు అని చెప్పి మొత్తం వివరించిన తర్వాత కార్ తీశాడు” అని తెలిపింది.