సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర

  • Published By: madhu ,Published On : August 20, 2020 / 08:18 AM IST
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర

Updated On : August 20, 2020 / 8:27 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొంతమంది ట్రై చేశారనే వార్త సినీ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపింది. పంజాబ్, రాజస్థాన్, హర్యాణకు చెందిన నలుగురు సభ్యుల టీం…సల్లూ భయ్ పై హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫరీదాబాద్ పోలీసులు గుర్తించారు.



షార్ప్ షూటర్ రాహుల్ అలియాస్ సంగా అలియాస్ బాబాను ఉత్తరాఖండ్ లో ఆగస్టు 15న ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తుండగా..ఈ ఉదంతం బయటకు వచ్చింది. హత్యకు జోధ్ పూర్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తనకు సుఫారీ ఇచ్చారని రాహుల్ చెప్పాడని సమాచారం.



రాహుల్ ముంబాయికి వచ్చి బాంద్రాలో నివాసం ఉంటున్న సల్మాన్ కదలికలపై రెక్కీ నిర్వహించాడని పోలీసులు గుర్తించారు. అసలు ఎందుకు హత్య చేయాలని అనుకున్నారనే కోణంలో పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. రాజస్థాన్ లోని బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను ఆరాధిస్తుంటుంది.



అయితే..కృష్ణ జింకలను చంపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సల్మాన్. దీంతో అతడిపై లారెన్స్ బిష్ణోయ్ కోపం పెంచుకున్నాడు. అందుకే హత్యకు ప్రయత్నాలు చేశారని పోలీసులు వెల్లడించారు.