Fatima Vijay Antony : కూతురు మరణంపై మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన విజయ్ ఆంటోనీ భార్య.. చావు బతుకులు అర్ధం కావట్లేదంటూ..

తాజాగా విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఆంటోనీ తన కూతురి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Fatima Vijay Antony : కూతురు మరణంపై మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన విజయ్ ఆంటోనీ భార్య.. చావు బతుకులు అర్ధం కావట్లేదంటూ..

Fatima Vijay Antony emotional post on her Daughter Meera

Updated On : December 11, 2023 / 10:18 AM IST

Fatima Vijay Antony : తమిళ్ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా(Meera) కొన్ని నెలల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది. చిన్న వయసులోనే ఇలా మరణించడంతో ఆమె తల్లితండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కూతురు మరణించిన బాధ నుండి ఇంకా బయటకి రాలేకపోతున్నారు. ఆ బాధని మర్చిపోవడానికి వర్క్ లో బిజీ అవుతున్నారు విజయ్ ఆంటోనీ, ఆయన భార్య ఫాతిమా.

విజయ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. విజయ్ ఆంటోనీ నిర్మాణ సంస్థ పనులు చూసుకుంటూ ఫాతిమా ఆంటోనీ కూడా బిజీగా ఉంది. వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా కూతురి మరణాన్ని మర్చిపోలేకపోతున్నారు ఈ జంట. తాజాగా విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఆంటోనీ తన కూతురి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Also Read : Redin Kingsly : లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కమెడియన్.. 46 ఏళ్ళకి మూడుముళ్లు..

కూతురు మీరాతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫాతిమా ఆంటోనీ.. మీరా, నీ పియానో నీ టచ్ లేక బాధపడుతుంది. నువ్ లేవని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. ఈ ప్రపంచం నీ కోసం కాదేమో. కానీ అమ్మ ఇంకా ఇక్కడే ఉంది. ఈ చావు బతుకుల మధ్య గీత నాకు అర్ధం కావట్లేదు. నిన్ను కలిసేదాకా బ్లాంక్ గానే ఉంటాను. అక్కడ బాగా తిని రెస్ట్ తీసుకో, నిన్ను మిస్ అవుతున్నాం అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా పలువురు అభిమానులు, నెటిజన్లు బాధపడకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.