Pawan Kalyan : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిన్నెర మొగులయ్యకి సన్మానం
కిన్నెర మొగులయ్య మాట్లాడుతూ.. ''పవన్ సర్ సినిమాలో పాట పాడాక గొప్ప పేరు వచ్చింది. కెసిఆర్ సర్ నాకు సన్మానం చేసి, నాకు ఇల్లు స్థలం ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సర్ కూడా..

Kinera
Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుంది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భీమ్లా నాయక్ సినిమాలో సాంగ్ పాడిన కిన్నెర మొగులయ్య కూడా వచ్చారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్మాత నాగవంశీ, తమన్, డైరెక్టర్ సాగర్ కే చంద్ర కిన్నెర మొగులయ్యకి సన్మానం చేశారు. ఆ తర్వాత కిన్నెర మొగులయ్య ఆనందిస్తూ మాట్లాడారు.
Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్..
కిన్నెర మొగులయ్య మాట్లాడుతూ.. ”పవన్ సర్ సినిమాలో పాట పాడాక గొప్ప పేరు వచ్చింది. కెసిఆర్ సర్ నాకు సన్మానం చేసి, నాకు ఇల్లు స్థలం ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సర్ కూడా సన్మానం చేసి ఆర్ధిక సాయం చేశారు. ఈ సినిమాలో పాడటం నాకు అదృష్టం. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. అందరు నాకు సన్మానం చేయడం నాకు సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలే అడుగుతున్నారు. ఈ సినిమా మంచిగా నడవాలి. మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను. తమన్ సర్ కి, పవన్ సర్ కి రుణపడి ఉంటా. తమన్ సర్ నన్ను బాగా పాడిచ్చారు. అని తెలిపి పాటని పాడారు.