ముంబైలో 40 డేస్ దడదడలాడించిన ‘ఫైటర్’

  • Published By: sekhar ,Published On : March 8, 2020 / 09:13 AM IST
ముంబైలో 40 డేస్ దడదడలాడించిన ‘ఫైటర్’

Updated On : March 8, 2020 / 9:13 AM IST

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా.. ‘ఫైటర్’.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో బాలీవుడ్‌కి పరిచయం అయిన అనన్యా పాండే ఈ సినిమాలో రౌడీతో రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్ప‌టివ‌ర‌కూ చిత్ర బృందం 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోగా, వాటిలో రెండు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా ఉన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌న్యా పాండే, రోణిత్ రాయ్‌, అలీ త‌దిత‌రుల‌పై ముఖ్య‌మైన స‌న్నివేశాలు చిత్రీకరించారు.
పాన్ ఇండియా ఫిల్మ్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమాని బ‌డ్జెట్ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా భారీ స్థాయిలో పూరి క‌నెక్ట్స్, ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. అత్యంత ఆస‌క్తిక‌రమైన‌ ఈ క్రేజీ కాంబినేష‌న్ సినిమాకు విష్ణుశ‌ర్మ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ఇదివ‌ర‌కు పూరి జ‌గ‌న్నాథ్ ఫిల్మ్ ‘ఇద్ద‌ర‌మ్మాయిల‌తో..’ స‌హా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేసి మంచి పేరు సంపాదించుకున్న కెచ్చా.. స్టంట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ స‌హ నిర్మాణంలో త‌యార‌వుతున్న ఈ యాక్ష‌న్ ఫిల్మ్‌ను పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా క‌లిసి నిర్మిస్తున్నారు. తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్యా పాండే, ర‌మ్య‌కృష్ణ‌, రోణిత్ రాయ్‌, విష్ణురెడ్డి, అలీ, మ‌క‌రంద్ దేశ్‌పాండే, గెట‌ప్ శ్రీ‌ను త‌దిత‌రులు.

సాంకేతిక బృందం:
సినిమాటోగ్రాఫ‌ర్‌: విష్ణుశ‌ర్మ‌
ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖీ
ఆర్ట్‌: జానీ షేక్ బాషా
స్టంట్స్‌: కెచ్చా
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.