BiggBoss Non Stop : మళ్ళీ కొట్టుకున్న బిగ్‌బాస్‌ సభ్యులు.. సరయు, శ్రీరాపాక ఒకరిపై ఒకరు పడిపోయి..

తాజాగా బిగ్‌బాస్‌ హౌస్ లో రెండో కెప్టెన్ కోసం టాస్కులు నడుస్తున్నాయి. ఈ రెండో కెప్టెన్సీ పోటీలో తగ్గేదేలే అంటూ స్మగ్లర్లు, పోలీసులు అన్నట్టు ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో వారియర్స్‌....

BiggBoss Non Stop :  మళ్ళీ కొట్టుకున్న బిగ్‌బాస్‌ సభ్యులు.. సరయు, శ్రీరాపాక ఒకరిపై ఒకరు పడిపోయి..

Biggboss

Updated On : March 11, 2022 / 7:48 AM IST

 

BiggBoss Non Stop :  బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మొదటి వారం అయిపోయి రెండో వారం చివరికి వచ్చింది. ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ అయ్యారు షో నుంచి. ఇక బిగ్‌బాస్ షోలో ఈ సారి మొదటి నుంచి కూడా గొడవలు, పగలు, ఏడుపులు ఉన్నాయి. ఆ గొడవలతో ఇప్పటికే బిగ్‌బాస్ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సారి మరింతముందుకు వెళ్లి కొట్టుకునేదాకా వెళ్లిపోయారు కంటెస్టెంట్స్. పాత కంటెస్టెంట్స్ వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్స్ చాలెంజర్స్ గా గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి గేమ్ అంతా వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్టే నడుస్తుంది.

తాజాగా బిగ్‌బాస్‌ హౌస్ లో రెండో కెప్టెన్ కోసం టాస్కులు నడుస్తున్నాయి. ఈ రెండో కెప్టెన్సీ పోటీలో తగ్గేదేలే అంటూ స్మగ్లర్లు, పోలీసులు అన్నట్టు ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో వారియర్స్‌ సభ్యులు స్మగ్లర్లుగా మారగా చాలెంజర్స్‌ పోలీసుల్లా మారారు. స్మగ్లర్లను అడ్డుకునేందుకు పోలీసులు డోర్‌ దగ్గరే ఉండిపోవడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఈ గొడవల్లో శ్రీరాపాకకి తలకి దెబ్బ తగిలింది. ఆ తర్వాత మహేష్ విట్టా, ఆర్జే చైతూ, నటరాజ్‌ మాస్టర్‌, యాంకర్‌ శివ కొట్టుకోడానికి ఒకరిమీదకి ఒకరు వెళ్లారు.

Radheshyam : అదిరిపోయిన ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ బిజినెస్..

ఇక గేమ్‌లో గాయపడ్డ రాపాక ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. తన దగ్గరున్న బొమ్మలను సరయుపైకి విసిరేయడంతో సరయు తలకు దెబ్బ తగిలి చేతులు పట్టుకుని కింద కూర్చుంది. దీంతో అఖిల్‌ శ్రీ రాపాక మీద ఫైర్ అయ్యారు. దీంతో మళ్ళీ రెండు టీమ్స్ కొట్టుకోడానికి రాగా శ్రీ రాపాక సరయు మీద పడి కొట్టుకున్నారు. దీంతో రెండు టీమ్స్ వాళ్ళని విడదీసి కూర్చోపెట్టారు. గతంలో కంటే ఈ సారి గొడవలు, కొట్లాటలు మరీ ఎక్కువ ఉండటంతో ఈ సారి ఇంకెంతమంది కొట్టుకుంటారో అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.