Filmfare Awards 2024 : 69వ ఫిలింఫేర్ అవార్డ్స్.. టెక్నికల్ అవార్డుల ప్రకటన.. యానిమల్, జవాన్ హవా..

69వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024 వేడుక నిన్న, ఈ రోజు గుజరాత్ లో జరుగుతుంది. నిన్న టెక్నికల్ కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డుల్ని ప్రకటించారు. నేడు యాక్టింగ్, డైరెక్షన్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించనున్నారు.

Filmfare Awards 2024 : 69వ ఫిలింఫేర్ అవార్డ్స్.. టెక్నికల్ అవార్డుల ప్రకటన.. యానిమల్, జవాన్ హవా..

Filmfare Awards 2024 Announced Animal Jawan Sam Bahadur Movies Big in Technical Categories

Updated On : January 28, 2024 / 10:43 AM IST

Filmfare Awards 2024 : ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ సినిమా అవార్డుల వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024 వేడుక నిన్న, ఈ రోజు గుజరాత్ లో జరుగుతుంది. నిన్న టెక్నికల్ కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డుల్ని ప్రకటించారు. నేడు యాక్టింగ్, డైరెక్షన్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించనున్నారు. ఈసారి అవార్డుల్లో యానిమల్(Animal), జవాన్(Jawan), సామ్ బహదూర్(Sam Bahadur) సినిమాలు హవా చూపిస్తున్నాయి.

69వ బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డుల్లో టెక్నికల్ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది వీరే..

బెస్ట్ సౌండ్ డిజైన్ – కునాల్ శర్మ(సామ్ బహదూర్), సింక్ సినిమా(యానిమల్)
బెస్ట్ బ్యాజ్ గ్రౌండ్ స్కోర్ – హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే(సామ్ బహదూర్)
బెస్ట్ VFX – రెడ్ చిల్లీస్(జవాన్)
బెస్ట్ ఎడిటింగ్ – జస్కున్వర్ సింగ్, విధు వినోద్ చోప్రా?(12th ఫెయిల్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – సచిన్ లోవెల్కర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – అవినాష్ అరుణ్ (త్రి ఆఫ్ అజ్)
బెస్ట్ కొరియోగ్రఫీ – గణేష్ ఆచార్య( వాట్ జుంఖా – రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని)
బెస్ట్ యాక్షన్ – జవాన్

Also Read : Akira Nandan : పవన్ కళ్యాణ్‌ని అచ్చు గుద్దేసినట్టు దింపిన అకిరా నందన్.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..

మరి నేడు బెస్ట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డులు ఎవరు గెలుచుకుంటారో చూడాలి.