Akhanda Fire : అఖండ సినిమా చూస్తుండగా మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రేక్షకులు
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో మంటలు చెలరేగాయి. శ్రీకాకుళంలోని రవిశంకర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.

Akhanda Fire
Akhanda Fire : నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో మంటలు చెలరేగాయి. శ్రీకాకుళంలోని రవిశంకర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. థియేటర్ లో అఖండ ఫస్ట్ షో ప్రారంభమైంది. కాసేపకే స్క్రీన్ వెనుకున్న సౌండ్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
Balakrishna : ANRని ఇమిటేట్ చేసిన బాలయ్య.. ఆహా అంటున్న ఫ్యాన్స్
అనుకోని ఘటనతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. థియేటర్ బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం, సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Aghoraa : ఇప్పటివరకు అఘోరా పాత్రలో కనిపించిన హీరోలు వీళ్లే
బోయపాటి శ్రీను -బాలయ్య కాంబినేషన్ లో మూడో సినిమా అఖండి. భారీగా రిలీజ్ అయిన అఖండ బిగ్ సక్సెస్ అందుకుని టాలీవుడ్ కి కొత్త ఊపు తెచ్చింది. ఇప్పుడు ఎక్కడా విన్నా అఖండ గురించే చర్చ నడుస్తోంది. అఖండ సినిమాలో బాలయ్య విశ్వరూపం సినిమాకే హైలైట్. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య కాకుండా ఈ పాత్రలో మరొకరిని ఊహించడం కష్టమనే మాటలు వినిపించాయి.
అఖండ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. బాలయ్య ఉగ్రరూపం చూసి అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. అభిమానులే కాదు.. అఘోరాలూ సినిమా చూసేందుకు వచ్చారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్ లో అఘోరాలు సందడి చేశారు.
‘అఖండ’ సినిమా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో బాలయ్య ఇతర సినిమాలతో పోలిస్తే అఖండ ముందంజలో ఉంది. వీకెండ్‌లో కూడా అదే స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా అఖండ జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికాలో అఖండ కలెక్షన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే 7 లక్షల డాలర్ల మార్కును టచ్ చేసింది అఖండ.
అంతే కాకుండా వేగంగా 1 మిలియన్ వసూళ్ల వైపు పరుగులు పెడుతోంది. మూడు రోజుల్లోనే అఖండ రూ. 60 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లోనే కాదు.. మల్టీప్లెక్స్‌లో కూడా చాలా చోట్ల అఖండకు హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. బోయపాటి మాస్ టేకింగ్, బాలకృష్ణ యాక్షన్, తమన్ మ్యూజిక్.. అన్నీ కలిపి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని బాలయ్య అభిమానులు అంటున్నారు.