Kalidas : మొట్టమొదటి టాకీ చిత్రం ‘కాళిదాస్’ కు 90 ఏళ్లు.. పునీత్ మరణంతో ప్రకటన వాయిదా..
తెలుగు, తమిళ భాషల్లో మొట్టమొదటి టాకీ చిత్రంగా రూపొందిన ‘కాళిదాస్’ విడుదలై 2021 అక్టోబర్ 31 నాటికి 90 సంవత్సరాలు పూర్తవుతోంది..

Kalidas 90 Years
Kalidas: తెలుగు, తమిళ భాషల్లో మొట్టమొదటి టాకీ చిత్రంగా రూపొందిన ‘కాళిదాస్’ విడుదలై 2021 అక్టోబర్ 31 నాటికి 90 సంవత్సరాలు పూర్తవుతోంది. 1931 అక్టోబర్ 31 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. టి.పి. రాజ్యలక్ష్మీ, పి.జి. వెంకటేశన్ ప్రధానపాత్రల్లో నటించారు.

Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!
హెచ్.ఎమ్. రెడ్డి దర్శకత్వంలో.. ఇంపీరియల్ మూవీ టోన్ బ్యానర్ మీద ఆర్దేషిర్ ఇరానీ నిర్మించారు. సంసృతంలోని కాళీదాస్ కవిత్వం ఆధారంగా సౌత్ ఇండియాలో రెండు భాషల్లో వచ్చిన ఫస్ట్ సౌండ్ ఫిలిం ‘కాళీదాస్’..
Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’
ఈ చిత్రం 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఆదివారం (అక్టోబర్ 31) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ రోజు ఒక గొప్ప అనౌన్స్‌మెంట్ చేద్దామని ఇది వరకే అనుకున్నాము. తోటి కళాకారుడు పునీత్ రాజ్ కుమార్ మనల్ని విడి వెళ్లిన ఈ తరుణంలో వాయిదా వేయాలని నిర్ణయించాము. తదుపరి అనౌన్స్‌మెంట్ త్వరలో విడుదల చేస్తాం’ అని ట్వీట్ చేశారు విష్ణు.
Pushed to another day . pic.twitter.com/tbXeAubd50
— Vishnu Manchu (@iVishnuManchu) October 31, 2021