లైఫ్‌లో ఫస్ట్ టైమ్.. సొంత రూల్స్‌ను బ్రేక్ చేసిన నయనతార.. ఎందుకంటే?
ప్రమోషన్‌తోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది.

హీరోయిన్ నయనతార తెలుగు సినిమాలకు ఎప్పుడూ ప్రమోషన్స్ చేయలేదు. సినిమా రిలీజ్‌కి ముందు కానీ, రిలీజ్ టైమ్‌లో కానీ కేవలం తమిళంలో తాను తీసిన సినిమాలకు మాత్రమే ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది.
చిరంజీవితో గతంలో చేసిన సినిమాల వేళ కూడా ప్రమోషన్స్‌కి ఆమె రాలేదు. బాలయ్యతో చేసిన సినిమా ప్రమోషన్‌లో కూడా పాల్గొనలేదు. తాను ప్రమోషన్స్‌లో పాల్గొనబోనని ఆమె ముందుగానే సినిమా యూనిట్‌కు చెప్పేస్తుంది.
ఇఫ్పుడు అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమాకి మాత్రం ప్రమోషన్‌తోనే షూటింగ్ మొదలు పెట్టింది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించనుందని కొంత కాలంగా ప్రచారం జరిగింది. దీన్ని నిజం చేస్తూ నయనతారకు సంబంధించిన ఓ వీడియోను ఆ మూవీ టీమ్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇందులో నయనతార మేకప్ వేసుకుంటున్న దృశ్యాలు, కారులో ప్రయాణించిన దృశ్యాలు ఉన్నాయి. తెలుగు సినిమాలకు ఎప్పుడూ ప్రమోషన్స్ చేయని నయనతార ఈ సినిమాకు మాత్రం ఇలా వినూత్న రీతిలో ప్రమోషన్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇటువంటి వినూత్న ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తే సహకరిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడికి నయనతార చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.